Indian: హత్య కేసులో అరెస్టైన భారత ప్రవాసుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి!
ABN, First Publish Date - 2023-09-05T09:39:24+05:30
ల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తోటి ఫిలిప్పీనో (Filipino) కార్మికుడిని భారత వ్యక్తి హతమార్చాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తోటి ఫిలిప్పీనో (Filipino) కార్మికుడిని భారత వ్యక్తి హతమార్చాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భారత ప్రవాసుడి (Indian Expat) ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఫిలప్పీన్ వ్యక్తి చనిపోయి ఉండగా, భారతీయుడు రక్తపుమడుగులో పడి ఉన్నాడు.
కొనఊపిరితో ఉన్న భారత వ్యక్తి (Indian man) ని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం ఒమారియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం భారత ప్రవాసుడు కూడా మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. అసలు ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఫిలిప్పీయన్‌ను భారతీయ వ్యక్తి ఎందుకు హత్య చేశాడు? తదితర వివరాలు కనుగొనే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Kuwait: విషాద ఘటన.. భవనంపై నుంచి పడి భారతీయ నర్సు మృత్యువాత!
Updated Date - 2023-09-05T09:39:24+05:30 IST