ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: విషాద ఘటన.. భవనంపై నుంచి పడి భారతీయ నర్సు మృత్యువాత!

ABN, First Publish Date - 2023-09-05T08:24:16+05:30

కువైత్‌లోని అబ్బాసియా (Abbasiya) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ నర్సు (Indian Nurse) భవనంపై నుంచి పడి మృత్యువాత పడింది.

కువైత్ సిటీ: కువైత్‌లోని అబ్బాసియా (Abbasiya) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ నర్సు (Indian Nurse) భవనంపై నుంచి పడి మృత్యువాత పడింది. మృతురాలిని 42 ఏళ్ల షీబా (Sheeba)గా గుర్తించారు. అబ్బాసియాలోని అప్సరా బజార్‌ (Apsara Bazaar) లో ఆమె నివాసం ఉండే పదో అంతస్తు భవనంపై నుంచి పడిపోయింది. షీబా స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ క్లినిక్‌లో నర్సుగా పని చేస్తోంది. మృతురాలిది కేరళ రాష్ట్రం చంగనస్సేరి (Changanasserry). ఆమె భర్త రెజీ కేఐఆర్‌బీవై కంపెనీలో పని చేస్తున్నారు.

కాగా, షీబా దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు స్వదేశంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అలాగే కూతురు అబ్బాసియాలోని యునైటెడ్ ఇండియన్ స్కూల్‌ (United Indian School) లో చదువుతోంది. షీబా మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆమె స్వస్థలం చంగనస్సేరి విషాదం అలుముకుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కువైత్ పోలీసులు (Kuwait Police) దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడిపోయిందా? లేదా మరేతర కారణం ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Digital Jobs: సౌదీ సూపర్ ప్లాన్.. ఒకేసారి లక్ష మందికి ట్రైనింగ్..!


Updated Date - 2023-09-05T08:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising