ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Origin Man: కాటికి కాలు చాపే వయసులో.. బ్రిటన్‌లో భారతీయ వృద్ధుడు చేసిన ఘోరం ఇదీ..!

ABN, First Publish Date - 2023-05-07T13:20:54+05:30

భారత సంతతికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడు బ్రిటన్‌లో ఘోరానికి పాల్పడ్డాడు. టార్సామే సింగ్‌ (Tarsame Singh) అనే భారతీయ వ్యక్తి అతి కిరాతకంగా తన భార్య మాయా దేవిపై (Maya Devi) దాడి చేసి చంపేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: భారత సంతతికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడు బ్రిటన్‌లో ఘోరానికి పాల్పడ్డాడు. టార్సామే సింగ్‌ (Tarsame Singh) అనే భారతీయ వ్యక్తి అతి కిరాతకంగా తన భార్య మాయా దేవిపై (Maya Devi) దాడి చేసి చంపేశాడు. దాంతో అతడిపై పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేసి, కటకటాల్లోకి నెట్టారు. ఈస్ట్ లండన్‌‌లోని (East London) హార్న్‌చర్చ్‌లో ఉండే తమ నివాసంలో భార్యను చంపినట్లు టార్సామే సింగ్‌ అంగీకరించాడు. మంగళవారం సాయంత్రం సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన భార్యను చంపేసినట్లు పోలీసుల వద్ద లొంగిపోయాడు.

సింగ్ సమాచారంతో వెంటనే పోలీసులు, వైద్యాధికారులు హార్న్‌చర్చ్‌లోని వారి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో మాయాదేవి తలకు బలమైన గాయాలతో రక్తపుమడుగులో పడి ఉంది. కోన ఊపిరితో ఉన్న ఆమెను కాపాడదామని అధికారులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. ఇక సింగ్‌ను గురువారం పోలీసులు బార్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరిచారు. కాగా, ఈ దంతపులు గత 50 ఏళ్లకు పైగా బ్రిటన్‌లో (Britain) నివాసం ఉంటోంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు గతంలో రెయిన్‌హామ్‌లో కలిసి పోస్టాఫీసు విధులు నిర్వర్తించేవారు. సింగ్ ఇటీవలే రిటైర్ అయ్యాడు. అయితే సింగ్ భార్యను ఎందుకు చంపాడో కారణం తెలియ రాలేదు. పోలీసుల విచారణ సమయంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Texas Mall Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. టీనేజీ యువతి సహా 9 మంది మృతి!

Updated Date - 2023-05-07T13:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising