H-1B Visa: అలా చేస్తే యూఎస్‌కు భారీగా భారత ఐటీ నిపుణులు వస్తారు.. భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడి సూచన
ABN, First Publish Date - 2023-04-21T14:16:51+05:30
భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదర్ (Indian Origin Congressman Shri Thanedar) హెచ్-1బీ వీసాల (H-1B visas) పరిమితిని పెంచాలని యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (US Homeland Security) కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్‌ను (Alejandro Mayorkas ) కోరారు.
ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదర్ (Indian Origin Congressman Shri Thanedar) హెచ్-1బీ వీసాల (H-1B visas) పరిమితిని పెంచాలని యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (US Homeland Security) కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్‌ను (Alejandro Mayorkas ) కోరారు. తద్వారా ఇండియా నుంచి ఎక్కువ మంది ఐటీ నిపుణులు (IT Professionals) అగ్రరాజ్యానికి రావడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు 2024 ఆర్ధిక సంవత్సరానికి గాను హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ కోసం బడ్జెట్‌పై జరిగిన హౌస్ కమిటీ విచారణ సందర్భంగా థానేదర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్దడంలో విస్తృత వైఫల్యానికి అమెరికా సరిహద్దు భద్రత కూడా కారణమని ఆయన తెలిపారు. మాతృదేశాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలకమైన సరిహద్దుకు మించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విస్తృత శ్రేణి మిషన్‌లను కలిగి ఉందని థానేదర్ పేర్కొన్నారు.
ఇక దేశంలోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (Transportation Security Administration) సిబ్బంది పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. ఇదిలాఉంటే.. ఆర్ధిక మాంద్యం కారణంగా అగ్రరాజ్యం వణుకుతోంది. దాంతో ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీలు వరుసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిస్ధితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూఎస్‌లో ఉద్యోగాలు కోల్పోతున్న విదేశీ కార్మికుల్లో భారతీయులు (Indians) భారీగా ఉన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలలో లే ఆఫ్‌ల (Layoffs) కారణంగా భారతీయులు పెద్ద సంఖ్యలో జాబ్స్ కోల్పోతున్నారు.
Columbus Shooting: అమెరికాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం.. ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువకుడు!
ఒకవైపు ఉద్యోగం పోయిందన్న బాధకంటే హెచ్-1బీ (H-1B) వీసాపై ఆ దేశంలో ఉన్న వారికి 60 రోజుల నిబంధన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హెచ-1బీ వీసాతో అమెరికాలో ఉంటున్న విదేశీ ఉద్యోగులు.. తమ జాబ్ పోయిన 60 రోజులలోపు మరో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అలాంటి వారు అమెరికాలో ఉండటానికి అనర్హులుగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అమలులో ఉన్న 60 రోజుల నిబంధనను 180 రోజులకు పెంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
Anti-Hindu Hate: బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ వ్యతిరేక ద్వేషం.. ప్రముఖ సర్వే నివేదికలో షాకింగ్ నిజాలు..!
Updated Date - 2023-04-21T14:16:51+05:30 IST