ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dubai Duty Free Raffle: భార‌తీయుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ. 8.22కోట్లు!

ABN, First Publish Date - 2023-09-29T09:33:34+05:30

దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ (Dubai Duty Free Millennium Millionaire) లో భార‌తీయుడికి జాక్‌పాట్ త‌గిలింది. భార‌త్‌కు చెందిన శంషుద్దీన్ చెరువట్టంటావిడ (Shamsudheen Cheruvattantavida) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు.

దుబాయ్‌: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ (Dubai Duty Free Millennium Millionaire) లో భార‌తీయుడికి జాక్‌పాట్ త‌గిలింది. భార‌త్‌కు చెందిన శంషుద్దీన్ చెరువట్టంటావిడ (Shamsudheen Cheruvattantavida) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో శంషుద్దీన్ రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు. సెప్టెంబర్ 16న ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ నెం. 1229కు ఈ ల‌క్కీ లాట‌రీ త‌గిలింది. గత కొన్నేళ్లుగా జెబెల్ అలీలో (Jebel Ali) ఉంటున్న అతడు గ‌తేడాది నుంచి తన తొమ్మిది మంది స్నేహితులతో ఈ లాట‌రీ టికెట్లు కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇంత త్వరగా తమకు అదృష్టం వరిస్తుందని ఊహించలేదని ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తాన్ని తన మిత్రులతో పంచుకుంటానని తెలిపాడు. తన వాటాలో కొంత మొత్తం స్వచ్ఛంద కార్యక్ర‌మాల‌కు వినియోగిస్తాన‌ని చెప్పుకొచ్చాడు.

కేర‌ళ రాష్ట్రానికి చెందిన శంషుద్దీన్ చెరువట్టంటావిడకు భార్య, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. జెబెల్ అలీలో రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు పీఆర్ఓ (PRO) గా పనిచేస్తున్నాడు. ఇదిలాఉంటే.. 1999లో ప్రారంభ‌మైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 1 మిలియ‌న్ డాల‌ర్లు గెలుచుకున్న భార‌తీయుల్లో శంషుద్దీన్ 216వ వ్య‌క్తి. కాగా, ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్ల కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది భార‌తీయులేన‌ని లాట‌రీ నిర్వాహ‌కులు తెలియ‌జేశారు.

Saudi Arabia: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోనే 15వేల మంది అరెస్ట్.. 10వేల మందికిపైగా దేశ బహిష్కరణ!

Updated Date - 2023-09-29T09:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising