ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold from Dubai: ఇండియాలో పసిడి విక్రయాలపై కొత్త నిబంధన.. దుబాయిలో సేల్స్‌పై ప్రభావం చూపనుందా..? నిపుణులు చెబుతున్నదేమిటంటే..

ABN, First Publish Date - 2023-03-09T10:40:06+05:30

ఇండియాలో (India) ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి హాల్‌మార్క్ ఆరు అంకెల కోడ్ (Six Digit Hallmark Code) లేకుండా పసిడి ఆభరణాల విక్రయాలు నిలిచిపోనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దుబాయి: ఇండియాలో (India) ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి హాల్‌మార్క్ ఆరు అంకెల కోడ్ (Six Digit Hallmark Code) లేకుండా పసిడి ఆభరణాల విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఇటీవలే భారత వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ (India's Ministry of Consumer Affairs, Food and Public Distribution) కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. అయితే, మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం దుబాయి బంగారం మార్కెట్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కస్టమర్లకు మరింత నాణ్యమైన పసిడి లభిస్తుందని అంటున్నారు. ఇక యూఏఈ నుంచి భారత్‌కు బంగారం తీసుకెళ్లే ప్రవాస ప్రయాణికులపై హాల్‌మార్కింగ్ మార్పు ప్రభావం చూపబోదని కూడా పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా దుబాయ్‌లోని ప్రముఖ జ్యువెలర్స్ బఫ్లే (Bafleh Jewellers) డైరెక్టర్ చిరాగ్ వోరా మాట్లాడుతూ..

"భారత్‌లో పసిడి హాల్‌మార్కింగ్ కొత్త నిబంధనలు దుబాయి బంగారం, ఆభరణాల మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఈ నిర్ణయం అనేది కేవలం ఆ దేశ సొంత నిబంధన మాత్రమే. అయితే, భారతీయ మార్కెట్‌పై ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారులను కలిగి ఉంది. దాని నిబంధనలు లేదా డిమాండ్‌లో ఏదైనా మార్పు దుబాయితో సహా ప్రపంచ బంగారం మార్కెట్‌పై పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది" అని చెప్పుకొచ్చారు. దుబాయి పసిడి వ్యాపారం, ఆభరణాల తయారీకి ప్రధాన కేంద్రంగా ఉందని, ఇది ఇండియాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో కస్టమర్లను అందిస్తుందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: 43 లక్షలు దాటిన కువైత్‌ జనాభా.. ప్రవాసుల వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు..!

ఇక భారత్‌లోని కొత్త హాల్‌మార్కింగ్ నిబంధనలు పసిడి ధర పెరుగుదలకు దారి తీవచ్చని చిరాగ్ వోరా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే నగలు ప్రమాణాలకు అనుగుణంగా కొత్త యంత్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందట. ఈ కారణంతో ఇండియాలో బంగారు ఆభరణాల ధరలలో స్వల్ప మార్పులు రావొచ్చన్నారు. అయితే, మొత్తం ప్రభావం అనేది మాత్రం గ్లోబల్ పసిడి ధరలు, మారకం ధరలు, వినియోగదారుల ప్రాధాన్యతల వంటి వివిధ ఫ్యాక్టర్స్‌పై ఆధారపడి ఉంటుందని చిరాగ్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ మెట్రో టు సౌదీ మెట్రో.. రియాధ్‌లో మెట్రో రైలు నడుపుతున్న హైదరాబాదీ మహిళ..!

Updated Date - 2023-03-09T10:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising