ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

US: ఆ దేశ పౌరులకు అమెరికా తీపి కబురు.. త్వరలోనే వీసా-ఫ్రీ ట్రావెల్!

ABN, First Publish Date - 2023-09-27T08:39:09+05:30

ఇజ్రాయెల్ పౌరులకు (Israel Citizens) అగ్రరాజ్యం అమెరికా తీపి కబురు అందించనుంది. ఈ దేశ పౌరులను యూఎస్‌ను సందర్శించడాన్ని సులభతరం చేయాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది.

వాషింగ్టన్: ఇజ్రాయెల్ పౌరులకు (Israel Citizens) అగ్రరాజ్యం అమెరికా తీపి కబురు అందించనుంది. ఈ దేశ పౌరులను యూఎస్‌ను సందర్శించడాన్ని సులభతరం చేయాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా 'వీసా వీవర్ ప్రోగ్రాం'లో (Visa Waiver Program) ఇజ్రాయెల్‌ను కూడా చేర్చాలనే యోచనలో ఉంది. ఇక ఈ కార్యక్రమం అనేది నిర్దిష్ట దేశాల ప్రజలు 90 రోజుల వరకు ఎలాంటి వీసా లేకుండా అగ్రరాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (Department of Homeland Security) ద్వారా ఇది నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా 40 దేశాలు లబ్ధి పొందుతున్నాయి. వీటిలో ఎక్కువగా యూరప్ (European), ఆసియా దేశాలు ఉన్నాయి.

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం 'వీసా వీవర్ ప్రోగ్రాం'కు ఇజ్రాయెల్‌ను జత చేయాలనే నిర్ణయం ఈ వారంలోనే వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియ రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో ప్రోగ్రాంలో ఇజ్రాయెల్‌ను (Israel) చేర్చేందుకు అధికారులు అప్రూవ్ చేయాలి. రెండో దశలో ప్రోగ్రామ్‌ను సిస్టమ్‌లో అమలు చేసి ప్రారంభించాల్సి ఉంటుంది. ఊహించని జాప్యాలు జరిగితే తప్ప ఇజ్రాయెల్‌ను ప్రోగ్రామ్‌లో చేర్చే ప్రక్రియలో రెండో దశకు సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర నెలల సమయం పట్టవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం నాటికి దీనిపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ (Alejandro Mayorkas) ప్రకటన చేసే అవకాశం ఉందట. అంతా అనుకున్నట్టు జరిగితే ఇజ్రాయెల్ పౌరులు ఈ ఏడాది చివరి నాటికి వీసాలు లేకుండానే అమెరికాకు (America) వెళ్లే వెసులుబాటు కలుగుతుంది.

Saudi Arabia: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోనే 15వేల మంది అరెస్ట్.. 10వేల మందికిపైగా దేశ బహిష్కరణ!


Updated Date - 2023-09-27T08:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising