ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: కొత్త వర్కింగ్ అవర్స్‌కు కువైత్ ఆమోదం.. ఇకపై ఉద్యోగులు..

ABN, First Publish Date - 2023-09-15T09:29:10+05:30

ప్రభుత్వ ఏజెన్సీల (Government agencies) లో పనిచేసే ఉద్యోగులకు అనువైన వర్కింగ్ అవర్స్ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను సివిల్ సర్వీస్ కౌన్సిల్ (Civil Service Council) ఆమోదం తెలిపింది.

కువైత్ సిటీ: ప్రభుత్వ ఏజెన్సీల (Government agencies) లో పనిచేసే ఉద్యోగులకు అనువైన వర్కింగ్ అవర్స్ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను సివిల్ సర్వీస్ కౌన్సిల్ (Civil Service Council) ఆమోదం తెలిపింది. ఇక ఈ కొత్త పనివేళల ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 7, 9 గంటల మధ్య కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 మరియు 3.30 గంటల మధ్య డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. ఉద్యోగులు (Employees) ఏడు గంటలు పని చేసేలా ఈ కొత్త వర్కింగ్ అవర్స్‌ను (New Working Hours) రూపొందించడం జరిగింది. ఇందులో అర్ధగంట పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే డ్యూటీ టైమింగ్ కౌంట్ అయ్యేది ఆరున్నర గంటలే అన్నమాట.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఈ రెండు టైమింగ్స్‌లో తమకు అనువైన పని గంటలను ఎంచుకోవచ్చని సివిల్ సర్వీస్ కౌన్సిల్ వెల్లడించింది. ఇక అర్ధగంట గ్రేస్ పీరియడ్ (Grace period) అనేది ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఆ హాఫెన్ అవర్ ఆలస్యంగా డ్యూటీ ఎక్కినా లేదా అర్ధగంట ముందు వెళ్లినా ఎలాంటి సమస్య ఉండదు. ఉద్యోగులను రీలిఫ్‌గా ఉంచడంతో పాటు వారికి పని గంటలలో ఫ్లెక్సిబిలిటీ కలిపించినప్పుడే పనులు తొందరగా పూర్తవుతాయనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ కొత్త పనివేళలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ కొత్త పనివేళలు అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Kuwait: వారం వ్యవధిలో 989 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

Updated Date - 2023-09-15T09:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising