Kuwait: వామ్మో.. ఇలా అయితే కువైత్‌లో చాలా కష్టం.. 2నెలల్లోనే 7,685 మంది దేశ బహిష్కరణ!
ABN, First Publish Date - 2023-10-04T11:50:23+05:30
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొన్ని నెలలుగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి దేశం నుంచి వెళ్లగొట్టడం చేస్తోంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొన్ని నెలలుగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి దేశం నుంచి వెళ్లగొట్టడం చేస్తోంది. ఇలాగే గత రెండు నెలల్లోనే ఏకంగా 7,685 మంది ఉల్లంఘనదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు (Deported) తాజాగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ (Ministry of Interior) వెల్లడించింది.
ఇక ఒక్క సెప్టెంబర్ మాసంలోనే 3,837 మందిని దేశం నుంచి వెళ్లగొట్టింది. వీరిలో 2,272 మంది పురుషులు, 1,565 మంది మహిళలు ఉన్నారు. కాగా, వీరిలో ఎక్కువ మంది పారిపోయిన కార్మికులు ఉండగా, మిగతా కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డవారు ఉన్నారని వివిధ సెక్టార్లకు చెందిన భద్రతాధికారులు తెలిపారు. అలాగే ఆగస్టులో 3,848 మంది దేశం నుంచి బహిష్కరించింది కువైత్. ఇలా రెండు నెలల్లో కలిపి 7,685 మంది ఉల్లంఘనదారులను దేశం నుంచి వెళ్లగొట్టింది.
ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ అధికారులు మాట్లాడుతూ.. రెసిడెన్సీ చట్టాన్ని (Residency law) ఉల్లంఘించిన వారిపై సెక్యురిటీ క్యాంపెయిన్స్ మునుముందు కూడా ఇలాగే అన్ని గవర్నరేట్‌లలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులతో పారిపోయిన కార్మికులకు ఎట్టిపరిస్థితుల్లో ఆశ్రయం కల్పించవద్దని పౌరులు, నివాసితులను అధికారులు కోరారు.
Kuwait: అన్నంత పని చేస్తున్న కువైత్.. 800 మంది ప్రవాసులు సర్వీస్ నుంచి తొలగింపు!
Updated Date - 2023-10-04T13:50:05+05:30 IST