ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: ఫ్యామిలీ వీసాల యోచనలో గల్ఫ్ దేశం.. గడువు ముగిసిన వీసాతో దేశంలో ఉంటే.. రోజుకు రూ.27వేల ఫైన్!

ABN, First Publish Date - 2023-12-10T07:59:14+05:30

గల్ఫ్ దేశం కువైత్ ఫ్యామిలీ వీసాలు జారీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్టికల్ 22 (ఫ్యామిలీ లేదా డిపెండెంట్ వీసా) ప్రకారం ఇచ్చే ఈ వీసాల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ఫ్యామిలీ వీసాలు జారీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్టికల్ 22 (ఫ్యామిలీ లేదా డిపెండెంట్ వీసా) ప్రకారం ఇచ్చే ఈ వీసాల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే 2024 ప్రారంభం నుంచి ఫ్యామిలీ వీసా దరఖాస్తులు మొదలయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారుల సమాచారం. అయితే, ఈ వీసాలను అందరికీ కాకుండా కొన్ని కేటగిరీల వారికి మాత్రమే పరిమితం చేసే యోచనలో కువైత్ ఉందట. ఉదాహరణకు వైద్యులు, యూనివర్సిటీ అండ్ అప్లైడ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్లు, కౌన్సిలర్లు, ఇతర కొన్ని కేటగిరీల వారికి వీటిని ఇచ్చేందుకు కువైత్ సర్కార్ సుముఖంగా ఉందని తెలియవచ్చింది. అయితే, అధికారికంగా ఇంకా ఏ ప్రవాస కేటరిగిరీలను అక్కడి ప్రభుత్వం నిర్ణయించలేదు. త్వరలోనే దీనిపై ఒక ప్రత్యేక కమిటీని నియమించనుంది. ఆ కమిటీ ఇచ్చే సలహాల మేరకు ఏ కేటగిరీల వారికి ఫ్యామిలీ వీసాలు ఇవ్వాలనేది నిర్ణయించబడుతుంది. ఈ కమిటీని కువైత్ మొదటి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ పర్యవేక్షిస్తారు.

ఇది కూడా చదవండి: NRI: కెనడాలో నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న ఎన్నారై.. అదెలాగో తెలుసా..?

వీసా గడువు ముగిసిన దేశంలో ఉంటే.. ఇకపై రోజుకి రూ.27వేల ఫైన్!

వీసా గడువు విషయంలో కువైత్ వెళ్లే పర్యాటకులు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) దేశాల ఏకీకృత గల్ఫ్ వీసా (Unified Gulf visa ) యంత్రాంగం వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్లని సందర్శకులకు రోజుకు 100 కువైటీ దినార్లు (రూ.27వేలు) జరిమానా విధిస్తుంది. అలాగే బస వ్యవధి కోసం ఆరోగ్య బీమా, హోటల్ రిజర్వేషన్‌పై కఠిన నిబంధనలు ఉంటాయి.

ఇది కూడా చదవండి: NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-10T08:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising