Kuwait: ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కీలక నిర్ణయం!
ABN, First Publish Date - 2023-10-17T06:56:13+05:30
గల్ఫ్ దేశం కువైత్ మరోసారి ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌ల (Expatriates driving licenses) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ మరోసారి ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌ల (Expatriates driving licenses) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసులందరీ డ్రైవింగ్ లైసెన్స్‌లను సమీక్షించాలని తాజాగా ట్రాఫిక్ విభాగం నిర్ణయించింది. ఇప్పటికే షరతులకు లోబడిలేని వందలాది మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లను కువైత్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయిన వారు కూడా వాటితోనే డ్రైవింగ్ చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇది ఆ దేశ ట్రాఫిక్ చట్టాల (Traffic Laws) ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇక కొన్ని లైసెన్స్‌లు షరతులతో కూడినవి ఉంటే.. మరికొన్ని జీతం మరియు విశ్వవిద్యాలయ అర్హత మినహాయింపులతో జారీ చేయబడ్డాయి. ఆ లైసెన్సులు ఇప్పుడు సమీక్షించబడతాయని ట్రాఫిక్ విభాగం (Traffic Department) స్పష్టం చేసింది. అలాగే అనుచిత మినహాయింపుతో వేలాది లైసెన్స్‌లు జారీ చేసినట్లు పలు నివేదికలు నిర్ధారించిన తర్వాత ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లు సమీక్షించాలనే నిర్ణయానికి ట్రాఫిక్ విభాగం అధికారులు వచ్చారు.
NRI Couple: బ్యాగ్ నిండా దేశీ స్నాక్స్ అందుకున్న ఎన్నారై జంట.. ఆ తర్వాత వారి ఆనందం చూస్తే..
Updated Date - 2023-10-17T06:56:55+05:30 IST