ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: నెట్టింట లేడీ ఎన్నారై లవ్‌స్టోరీ వైరల్.. సైన్స్ కథనంతో మొదలై.. రొమాన్స్ వరకు

ABN, First Publish Date - 2023-10-22T11:20:11+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఉండే లేడీ ఎన్నారై లవ్‌స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె సైన్స్ నిపుణురాలు కాగా, అతడు జర్నలిస్ట్. ఒక సైన్స్ కథనం విషయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడం, పెళ్లి వరకు వెళ్లడం జరిగింది.

NRI: అగ్రరాజ్యం అమెరికాలో ఉండే లేడీ ఎన్నారై లవ్‌స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె సైన్స్ నిపుణురాలు కాగా, అతడు జర్నలిస్ట్. ఒక సైన్స్ కథనం విషయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడం, పెళ్లి వరకు వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె నెట్టింట పెట్టడంతో అది వైరల్ అవుతోంది. ‘హౌ ఇట్ బిగిన్డ్ వర్సెస్ హౌ ఇట్స్ గోయింగ్’ (How It Began vs How It’s Going) అనే పాపులర్ ఆన్‌లైన్ ట్రెండ్, ఊహించని విధంగా ప్రజలు తమ నిజమైన ప్రేమను ఎలా కనుగొన్నారో చూపిస్తుంది. అలాంటి లవ్ స్టోరీస్‌లో భారతీయ సంతతి (Indian-Origin) కి చెందిన ఆస్ట్రో ఫిజిసిస్ట్ సంజనా కర్టిస్ (Astrophysicist Sanjana Curtis) స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. సంజన తన భాగస్వామి డారెన్ ఇంకోర్వాయా (Darren Incorvaia) ను మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విటర్) లో కలుసుకున్నారు. అతడొక సైన్స్ జర్నలిస్ట్‌ (Science Journalist ). ఇప్పుడు సంజన ఇదే ప్లాట్‌ఫామ్‌పై వారి అద్భుతమైన 'ఆన్‌లైన్ ప్రేమ కథ' (Internet Love Story) ను పంచుకున్నారు. ఆ లవ్‌స్టోరీయే ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Emirates Draw: ఇతడు ఎంత అదృష్టవంతుడో.. నెలనెలా రూ.5.6 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు..!


ఫ్రమ్ 'సైన్స్' టు 'రొమాన్స్'..

2021లో డారెన్ తాను రాస్తున్న కథనంపై నిపుణుల సలహా కోసం సంజనను సంప్రదించడంతో వారి కథ మొదలైంది. వ్యర్థాల నిర్వహణకు పరిష్కారంగా చెత్తను అంతరిక్షంలోకి పంపే అవకాశం గురించి ఆ కథనం. ఈ కథనంపై అతడికి ఆమె సైన్స్ పాఠాలు నేర్పించారు. అలా వారు మొదట ఫ్రెండ్లీగా మాట్లాడటం ప్రారంభించారు. ఆన్‌లైన్ వేదికగానే ఈ అంశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలా పరిచయం పెంచుకుంటూ చివరికి వారు చికాగో (Chicago) లో వ్యక్తిగతంగా కలిశారు. ఆ సమయంలో సంజనను డారెన్ 'కాఫీ డేట్' (Coffee date) కోసం అడిగాడు. దానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వారి మధ్య లవ్ జర్నీ మొదలైంది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటో చూస్తుంటే వారు సంతోషంగా నిశ్చితార్థం లేదా వివాహం చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారి మొదటి సంభాషణ స్క్రీన్‌షాట్‌తో పాటు సంజన తాజాగా ఆ ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కి ఆమె ‘ఇది ఎలా మొదలైంది.. ఇది ఎలా జరుగుతోంది #wemetontwitter.’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆమె పెట్టిన పోస్ట్‌కి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది ఈ లవ్‌స్టోరీపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. "నేను దీనిని అద్భుతమైన విజయంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది" అని ఒకరు, "ఇది సూటిగా.. సుత్తిలేకుండా ఉంది" అని మరొకరు, "పరిపూర్ణమైన ప్రేమ కథ" అని ఇంకొకరు కామెంట్ చేశారు.

UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..

Updated Date - 2023-10-22T11:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising