NRI: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. 5 ఏళ్లుగా ఎన్నారై మహిళపై అత్యాచారం.. ఆపై..
ABN, First Publish Date - 2023-06-20T09:52:18+05:30
పంజాబ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఎన్నారై మహిళను పెళ్లి పేరుతో ఓ దుర్మార్గుడు దారుణంగా మోసం చేశాడు.
ఎన్నారై డెస్క్: పంజాబ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఎన్నారై మహిళను పెళ్లి పేరుతో ఓ దుర్మార్గుడు దారుణంగా మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ల నుంచి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై బాధితురాలి నుంచి రూ.16లక్షల నగదు, మూడు ఐఫోన్లు కూడా తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జస్వీర్ సింగ్ (Jasveer Singh) అనే వ్యక్తి అమెరికాలో (America) నివసించే ఒక ఎన్నారై మహిళపై ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. అయితే, ఈ కామాంధుడి పాపం పండి అతడి మోసం బయటపడింది. తాజాగా ఖన్నా పోలీసులు (Khanna Police) జస్వీర్ను అరెస్టు చేశారు. నిందితుడు పెళ్లి పేరుతో బాధితురాలిని ఐదేళ్లుగా నమ్మించి అత్యాచారం చేస్తున్నాడు.
ఆపై ఆమె నుంచి రూ.16 లక్షలు, మూడు ఖరీదైన ఐఫోన్లు కూడా నిందితుడు తీసుకున్నాడు. ఈ క్రమంలో జస్వీర్కు ఇప్పటికే పెళ్లైందనే విషయం ఇటీవల ఖన్నాలో ఉండే బాధితురాలి సోదరి తెలుసుకుంది. ఈ విషయం తన అక్కకు చెప్పిందామె. అనంతరం ఖన్నా పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. ఇక ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఖన్నా పోలీసులు జస్వీర్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లూథియానా సెంట్రల్ జైలుకు (Ludhiana Central Jail) తరలించారు. నిందితుడి వల్ల నష్టపోయిన తన సోదరికి న్యాయం చేయాలని బాధితురాలి సోదరి చెబుతోంది. అయితే, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించారు.
Eid Al Adha: యూఏఈలో లాంగ్ వీకెండ్.. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు ఎన్ని రోజుల సెలవులంటే..
Updated Date - 2023-06-20T09:53:47+05:30 IST