NRI: మసాచుసెట్స్‌లో స్వచ్ఛంద సంస్థ వెబ్‌సైట్‌ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ
ABN, First Publish Date - 2023-07-20T13:53:39+05:30
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన 11 తరగతి చదువుతున్న ప్రవాస తెలుగు హై స్కూల్ విద్యార్థిని హాసిని పాపరాజు.. https://www.understem.org/ అనే స్వచ్ఛంద సంస్థని నెలకొల్పింది.
NRI: అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన 11 తరగతి చదువుతున్న ప్రవాస తెలుగు హై స్కూల్ విద్యార్థిని హాసిని పాపరాజు.. https://www.understem.org/ అనే స్వచ్ఛంద సంస్థని నెలకొల్పింది. ఈ సంస్థ వెబ్‌సైట్‌ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ ఆన్లైన్ ప్లాట్ ఫారం ద్వారా స్కూల్, కాలేజీ విద్యార్థులు ఉచితంగా పాఠ్య, తమ భవిష్యత్తు ప్రణాళికలకు సంబందించిన విషయాలను తెలుసుకోవచ్చు. అది కూడా తమ విద్యాసంస్థల పూర్వ విద్యార్థులని అడిగి తెలుసుకునే అవకాశం ఈ వెబ్‌సైట్ ద్వారా కల్పించబడింది. 'తానా' 23వ మహా సభలలో పాల్గొనడానికి వచ్చిన నందమూరి బాలకృష్ణను ప్రత్యేకంగా కలిసి హాసిని సంస్థ వివరాలని తెలిపింది. పూర్వ విద్యార్థులు తాము సంపాదించిన విజ్ఞానాన్ని, పని అనుభవాలని మరియు చదువుకున్న వివరాలని వివిధ రంగాలలో ఎలా ఉపయోగపడతాయో తమ జూనియర్లకు వివరించడం జరుగుతుంది.
ఇది పేద, వెనకపడిన తరగతులకు చెందిన విద్యార్థుల భవిష్యత్తుకి ఎంతో దోహదపడుతుందని వెబ్‌సైట్ రూపకర్త హాసిని వివరించింది. ఇంత చిన్న వయసులో ఈ ఆలోచన రావటం దానికి రూపకల్పన చెయ్యటం ఎంతో ఆనందం కలగచేసిందని, ఎంతో మంది భావితరాల పిల్లలకి స్ఫూర్తి ఇస్తుందని బాలకృష్ణ.. హాసినిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ https://www.understem.org/ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులుకు చేరువ కావడానికి తోడ్పడిన తానా సంస్థకి హాసిని పాపరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-07-20T13:53:39+05:30 IST