ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New policy for Expats: ఇకపై ప్రవాసులకు ప్రభుత్వ ఉద్యోగాలు అంత ఈజీ కాదు.. కొత్త పాలసీ రెడీ చేస్తున్న కువైత్!

ABN, First Publish Date - 2023-07-27T08:01:44+05:30

గల్ఫ్ దేశం కువైత్ ఇప్పటికే ప్రవాసుల పట్ల ఎన్నో ఆంక్షలు విధించింది.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ఇప్పటికే ప్రవాసుల పట్ల ఎన్నో ఆంక్షలు విధించింది. వర్క్ పర్మిట్లు, రెసిడెన్సీ ఇలా ప్రతి విషయంలో వలసదారులకు చుక్కలు చూపిస్తోంది. అటు ప్రభుత్వరంగంతో పాటు ఇటు ప్రైవేట్ రంగంలో కూడా అంతకంతకు ప్రవాసుల ప్రాబల్యం పెరిగిపోవడంతో కువైటీలకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయని భావించిన అక్కడి ప్రభుత్వం కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ని తీసుకొచ్చింది. ఐదేళ్ల క్రితం తీసుకొచ్చిన ఈ పాలసీ ద్వారా రెండు సెక్టార్లలోనూ భారీ సంఖ్యలో కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇప్పుడు ప్రవాసులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాల నియామకాల కోసం కొత్త పాలసీ (New policy) ని రూపొందించే పనిలో పడింది. అతి త్వరలోనే ఈ కొత్త పాలసీని అమలు చేస్తామని పార్లమెంటరీ మానవ వనరుల కమిటీ వెల్లడించింది.

ఇక కొత్త పాలసీ ప్రకారం నాన్-కువైటీలను ప్రభుత్వ ఉద్యోగాల్లో (Govt Jobs) నియమిస్తే వారి వివరాలను ప్రత్యేకంగా అధికారిక పత్రికల్లో ప్రచురించడం జరుగుతుంది. ఇందులో ఆయా ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, వాటికి ఎంపికైన అభ్యర్థుల అర్హతలతో కూడిన వివరాలను తెలియజేయడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ఇకపై ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాలకు ఎంపికైన ప్రవాసుల అర్హతలపై అభ్యంతరం ఉంటే.. అప్పీల్ చేయడానికి రెండు నెలల గడువు ఉంటుంది. ఈ గడువులోపు వచ్చిన అప్పీల్స్‌ను పరిశీలించిన అనంతరం ఏదైనా ఉద్యోగానికి ప్రవాసుడి అర్హతలు సరిపోలేదని లేలితే.. ఆ అభ్యర్థి నియామకాన్ని నిలిపివేయడం జరుగుతుంది. అలాగే ఆ ఉద్యోగాన్ని అన్ని అర్హతలు ఉన్న కువైటీకి ఇచ్చేస్తారు.

UK Visa: భారతీయ యువ వృత్తి నిపుణులకు బ్రిటన్ గుడ్‌న్యూస్

Updated Date - 2023-07-27T08:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising