కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OCI card: కెనడియన్ ఎన్నారైలకు తీపి కబురు.. యధావిధిగా ఆ సేవలు..!

ABN, First Publish Date - 2023-09-26T09:15:55+05:30

ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఘర్షణలు, భద్రతా సమస్యలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం రోజురోజుకీ ముదురుతోంది.

OCI card: కెనడియన్ ఎన్నారైలకు తీపి కబురు.. యధావిధిగా ఆ సేవలు..!

OCI card: ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఘర్షణలు, భద్రతా సమస్యలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఈ క్రమంలో తాజాగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడియన్లకు వీసాలు (Canada Visa) జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం చాలామంది కెనడియన్ ఎన్నారైలను (Canadian NRIs) ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపై భారత్‌కు వెళ్లే అవకాశం లేదా అనే సందేహాలు వారిని తీవ్రంగా కలిచివేశాయి. ఇలాంటి సందిగ్ధత పరిస్థితులలో కెనడియన్ ఎన్నారైలకు భారీ ఉపశమనం కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (Overseas Citizen of India) కార్డు కోసం కెనడియన్ ఎన్నారైలు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ అధికారి తాజాగా స్పష్టం చేశారు.

వీసాల జారీని నిలిపివేసినప్పటికీ, అది ఓసీఐ (OCI) దరఖాస్తు సేవలపై ఎలాంటి ప్రభావం చూపించదని సంబంధిత అధికారి తెలిపారు. ఓసీఐ కార్డ్ హోల్డర్‌లను ఇప్పటికీ అంగీకరిస్తామని, అయితే ఓసీఐ దరఖాస్తులను అందులోనూ ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తుల నుండి వచ్చే అప్లికేషన్లను మరింత నిశితంగా పరిశీలిస్తామని భారత్ చెబుతోంది. ఇక వీసా సేవలను నిలిపివేయడం వల్ల కెనడా-భారత సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ సంతతికి చెందిన చాలా మంది కెనడియన్లు కుటుంబం, స్నేహితులను సందర్శించడానికి లేదా వ్యాపారం లేదా పర్యాటక ప్రయోజనాల కోసం క్రమం తప్పకుండా ఇండియాకి వస్తుంటారు.

వీసా సర్వీసుల సస్పెన్షన్ వల్ల కెనడియన్ కంపెనీలు ఇండియాలో పనిచేయడం లేదా భారతీయ కంపెనీలు కెనడియన్ ఉద్యోగులను నియమించుకోవడం మరింత కష్టతరం అవుతుంది. అయితే ఈ నిషేధం అనేది తాత్కాలికమేనని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని భారత్ చెబుతోంది. కాగా, వీసా సర్వీసులు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఇకపోతే ఇండియాకి వెళ్లాల్సిన కెనడియన్ పౌరులు మాత్రం ఒట్టావాలోని భారత హైకమిషన్‌ను లేదా సమీపంలోని ఇండియన్ కాన్సులేట్‌ను (Indian Consulate) సంప్రదించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.

Domestic workers: భారత ఎంబసీ కీలక సలహాలు.. గృహ కార్మికులుగా పనిచేసే మనోళ్లు వీటిని తెలుసుకోవడం తప్పనిసరి కూడా..


Updated Date - 2023-09-26T09:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising