ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: కుటుంబ కలహాలతో ఎన్నారై ఘాతుకం.. రెండు నెలల కింద కెనడా నుంచి స్వదేశానికి వచ్చి.. చివరికి!

ABN, First Publish Date - 2023-08-31T09:07:52+05:30

పంజాబ్‌లోని నాకోదార్‌ (Nakodar) లో ఓ ఎన్నారై ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్నతండ్రిపై పదునైన కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఎన్నారై డెస్క్: పంజాబ్‌లోని నాకోదార్‌ (Nakodar) లో ఓ ఎన్నారై ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్నతండ్రిపై పదునైన కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు నెలల కింద కెనడా నుంచి స్వదేశానికి వచ్చిన ఎన్నారై (NRI).. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం నిందితుడు పారిపోయాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫగ్వారా పరిధిలోని నాకోదార్‌లో హర్జీత్ సింగ్ (64), భార్య సూరీందర్ కౌర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. అతని కుమారుడు సతీందర్ సింగ్ కెనడా (Canada) లో ఉంటాడు. రెండు నెలల కింద ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం నాకోదార్‌లోని ప్యూర్ వాల్ కాలనీలో ఉంటున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి తండ్రి నివాసానికి వచ్చాడు. ఆ సమయంలో హర్జీత్ సింగ్ ఒంటరిగా ఇంట్లో ఉండడం చూసిన సతీందర్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో తండ్రిపై విచక్షణారహితంగా దాడిచేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ హర్జీత్ అక్కడికక్కడే కుప్పకూలాడు. బయటకు వెళ్లిన భార్య సూరీందర్ కౌర్ కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

దాంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న హర్జీత్ సింగ్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూరీందర్ కౌర్ చెప్పిన సమాచారం ప్రకారం హర్జీత్ సింగ్‌పై దాడికి కారణం కుటుంబ తగాదాలేనని పోలీసులు చెబుతున్నారు. సతీందర్ సింగ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Kuwait: దేశం నుంచి వెళ్లగొడుతున్న ప్రవాసుల విషయంలో కువైత్ మరో కీలక నిర్ణయం..!


Updated Date - 2023-08-31T09:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising