NRI: కాణిపాకం వినాయకుడికి ఎన్నారై విలువైన వెండి కిరీటం బహూకరణ
ABN, First Publish Date - 2023-08-11T10:01:06+05:30
ఎన్నారై భక్తుడు (NRI Devotee) ఒకరు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు.
NRI: ఎన్నారై భక్తుడు (NRI Devotee) ఒకరు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు. యూకే యూరప్ టీడీపీ ఫోరం అధ్యక్షుడు శ్యామసుందర్ నాయుడు గురువారం సుమారు 3 కిలోల వెండి కిరీటాన్ని (Silver Crown) కాణిపాకం దేవస్థానం వారికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికి వెండి కిరీటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాణిపాకం వరసిద్ధుడికి (Kanipakam Vinyaka Temple) ఇలా భారీ కిరీటాన్ని బహూకరించి తన భక్తిని చాటుకున్నారు లండన్‌కు చెందిన ఎన్నారై శ్యామ్‌సుందర్‌రావు. కాగా, ఈ కిరీటం విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని ఆలయ ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. దాతను, వారి కుటుంబ సభ్యులను వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
Indian Passport: షాకింగ్ డేటా.. పాస్‌పోర్టులను సరెండర్ చేసిన 2.4 లక్షల మంది భారతీయులు..!
Updated Date - 2023-08-11T10:01:06+05:30 IST