ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI Girl: గోదారమ్మను కాపాడుకుందామంటూ 15ఏళ్ల తెలుగు ఎన్నారై బాలిక ఉద్యమం.. శభాష్ అంటున్న జనం..!

ABN, First Publish Date - 2023-05-17T12:29:25+05:30

ఇండియాలోని పెద్ద నదుల్లో గోదావరి (River Godavari) ఒకటి. మహారాష్ట్రలో పుట్టి ఎన్నో ప్రాంతాలను దాటి బాసర వద్ద తెలుగు నేలపైకి అడుగిడుతుంది గోదారమ్మ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇండియాలోని పెద్ద నదుల్లో గోదావరి (River Godavari) ఒకటి. మహారాష్ట్రలో పుట్టి ఎన్నో ప్రాంతాలను దాటి బాసర వద్ద తెలుగు నేలపైకి అడుగిడుతుంది గోదారమ్మ. తెలుగుజాతి చరిత్రకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక సంపదకు గోదారమ్మ సజీవ సాక్ష్యం. ఏడాది పొడవునా నీటితో పరవళ్లు తొక్కుతూ తెలుగు నేలను పచ్చగా ఉంచుతోంది. ఇలా ఎంతో వైభవాన్ని సొంతం చేసుకున్న గోదారిని ఇవాళ కాలుష్య భూతం పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఇండ్లలోని మురుగు నీళ్లు, వివిధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధజలాలు, చెత్తా, చెదారంతో గోదావరి తన కళను కోల్పోయింది. దాంతో గోదారమ్మను కాలుష్య రక్కసి నుంచి కాపాడాలంటూ ఎందరో ప్రభుత్వాలను కోరుతున్నారు. కానీ, పాలకులు పెడచెవిన పెడుతున్నారు. ఈ క్రమంలో 15 ఏళ్ల వయసులో అది కూడా ఎన్నో మైళ్ల దూరంలో ఉన్న అమెరికాలో (America) ఉంటూ ఓ తెలుగు ఎన్నారై బాలిక గోదావరి తల్లి దుస్థితిని చూసి చలించిపోయింది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా గోదారమ్మను కాపాడుకుందామని నడుం బిగించింది.

Kuwait: ప్రవాసుల విషయంలో తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమల్లోకి వస్తే వలసదారుల పంట పండినట్టే..!

అమెరికాలోని మెంఫిస్‌లో స్థిరపడిన తెలుగు ఫ్యామిలీకి చెందిన ఉమాశ్రీ పూజ్యం (Umasri Pujyam) అనే బాలిక 'సేవ్ గోదావరి' (Save Godavari) పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితం ఆమె తన స్వగ్రామం ఏపీలోని కోనసీమ జిల్లా రాజోలు సమీపంలోని పొన్నమండను సందర్శించినప్పుడు గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకోవడాన్ని చూసి ఈ మిషన్‌ను ప్రారంభించింది. గడిచిన రెండేళ్లుగా కాలుష్య సమస్యను పరిష్కారించడానికి స్థానిక కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లను ఒకచోట చేర్చి గోదావరి ప్రక్షాళన పనులను ఉమాశ్రీ మొదలు పెట్టింది. ఈ బృహత్తర కార్యక్రమం ఇప్పుడు వంద రోజుల మైలురాయిని చేరింది. వ్యర్థాలను సరైన విధంగా పారవేయడం, పర్యావరణంపై వాటి ప్రభావాన్ని తగ్గించే మార్గాల గురించి ఉమాశ్రీ స్థానికులకు కూలంకషంగా వివరిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా జల కాలుష్యంపై అవగాహన పెంచాలనే సదుద్దేశంతో 'యూత్ ఎగైనెస్ట్ వాటర్ పొల్యూషన్' (Youth Against Water Pollution) సంస్థను స్థాపించింది. 2021లో కరోనా కారణంగా వర్చువల్ మోడ్‌లో తరగతులు నిర్వహించినప్పుడు ఉమాశ్రీ చాలా రోజుల పాటు స్వదేశంలోనే ఉండి మిషన్ కోసం పని చేసింది. వీటితో పాటు సోషల్ మీడియా, వెబ్‌సైట్ ద్వారా కూడా కాలుష్యంపై అవగాహన కల్పించింది. ప్రస్తుతం ఆమె పదో తరగతి చదువుతోంది.

Nomad Passport Index: వరల్డ్‌లోనే బెస్ట్ పాస్‌పోర్ట్ యూఏఈదే.. మన ర్యాంక్ ఎంతో తెలిస్తే షాకవుతారు..!


ఈ సందర్భంగా ఉమాశ్రీ మీడియాతో మాట్లాడింది. తాను స్వగ్రామానికి వెళ్లినప్పుడు అక్కడివారు తాము తాగేందుకు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. పొన్నమండ గ్రామం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని చెప్పిన ఆమె.. తన పేరెంట్స్ కోనసీమ జిల్లాలోనే పెరిగారని చెప్పింది. తనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తమ ఫ్యామిలీ యూఎస్ వెళ్లినట్లు తెలిపింది. ఇప్పటికీ తమ బంధువులు ఈ గ్రామంలోనే ఉన్నారని పేర్కొంది. లక్షల మంది ప్రజల జీవనానికి ఆధారంగా ఉన్న గోదావరి కాలుష్యంతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ఉమాశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో వినియోగిస్తున్న హానికరమైన ఫర్టిలైజర్స్ కారణంగా ఇక్కడి నీరు వాగుల ద్వారా గోదావరిలోకి కలవడం, తద్వారా నది నీరు కలుషితంగా మారుతున్నట్లు గుర్తించానని ఆమె పేర్కొంది. ఈ కారణంగానే తాను నది ప్రక్షాళన, పర్యావరణ మిషన్‌కు శ్రీకారం చుట్టినట్లు ఉమాశ్రీ చెప్పుకొచ్చింది.

Kuwait: కువైత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. వందల మంది ప్రవాసులు అరెస్ట్!

Updated Date - 2023-05-17T12:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising