ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR: ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ABN, First Publish Date - 2023-05-10T07:51:13+05:30

ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మే 5వ తారీఖున (శుక్రవారం) దోహాలోని LA Cigale హోటల్‌లోని అల్ వాజ్బా బాల్రూమ్‌లో (ఖతార్) అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మే 5వ తారీఖున (శుక్రవారం) దోహాలోని LA Cigale హోటల్‌లోని అల్ వాజ్బా బాల్రూమ్‌లో (ఖతార్) అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి తారక రామారావు నట వారసుడు, హిందూపురం శాసనసభ్యులు, నట సింహం నందమూరి బాలకృష్ణ (బాలయ్య బాబు) పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ నేపధ్య గాయనీ గాయకులు సింహ భాగవతుల, ప్రవీణ్ కుమార్ కొప్పోలు, గాయని పర్ణిక మాన్య హాజరయ్యారు.

ఖతార్‌లోని భారత రాయబార సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అత్యున్నత సంస్థల (ICC, ISC ICBF, IBPN) అధ్యక్షులు, వారి ప్రతినిధులు, ఖతార్‌లోని తెలుగు ప్రముఖులు, వివిధ తెలుగు సంఘాల (TKS, TPS, TGS, TJQ, TBA) అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖతార్‌లోని నలుమూలల నుండి 1,200 మందికి పైగా హాజరయ్యారు.

బాలబాలికల సంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాల్ని మొదలుపెట్టగా గాయనీ గాయకులు సింహ, ప్రవీణ్, పర్ణిక ఎన్‌టీఆర్ (NTR) మరియు ఎన్‌బీకే (NBK) పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలయ్య బాబు తన తండ్రి (ఎన్టీఆర్) గురించి అద్భుత ప్రసంగం చేయడమే కాకుండా "శివశంకరీ శివానందలహరి" పాటను పాడి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. బాలయ్య పాటకు ప్రేక్షకులందరూ ఫిదా అయ్యి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అలాగే హర్షధ్వానాలతో "జై బాలయ్య" నినాదాలతో హాలంతా మార్మోగింది. అయన లైవ్‌‌లో పాడిన పాట ఇప్పటికీ నెట్‌లో వైరల్‌గా మరి హల్‌చల్ చేస్తోంది.

ఆంధ్ర కళావేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ కేవలం వారం రోజుల సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం "నభూతో నభవిష్యత్" అనే విధంగా ఖతార్‌లోని తెలుగు సంఘాలలో చరిత్ర సృష్టించిందన్నార. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి అవకాశం కల్పించి సహకరించిన గొట్టిపాటి రమణయ్యకి, ప్రాయోజితులకు(స్పాన్సర్స్) తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేగాక కార్యక్రమ నిర్వహణ ప్రోత్సాహక కమిటీ సభ్యులు అయిన గోపాల్, వాసు, రమేష్, విక్రమ్ సుఖవాసికి, స్వచ్ఛంద సేవకులుగా(వాలంటీర్స్) సహకరించిన వారికి ప్రత్యేకంగా గోవర్ధన్ అమూరుకు, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన మీడియా సహకారాన్ని అందిస్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, శ్రీ సుధ, శిరీష రామ్, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, కేజీ రావు బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.

Updated Date - 2023-05-10T07:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising