ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indians: కెనడా ఐటీ రంగంలో భారతీయ నిపుణుల హవా.. ఒకే ఏడాదిలో..

ABN, First Publish Date - 2023-08-31T10:42:32+05:30

కెనడా టెక్ ఇండస్ట్రీలో భారతీయ ఐటీ నిపుణుల (Indian Tech Professionals) హవా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ది టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా (TECNA), కెనడా టెక్ నెట్‌వర్క్ (CTN) రిపోర్ట్ దీన్ని ధృవీకరించింది.

ఎన్నారై డెస్క్: కెనడా టెక్ ఇండస్ట్రీలో భారతీయ ఐటీ నిపుణుల (Indian Tech Professionals) హవా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ది టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా (TECNA), కెనడా టెక్ నెట్‌వర్క్ (CTN) రిపోర్ట్ దీన్ని ధృవీకరించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఒక ఏడాది కాలానికి సంబంధించిన ఐటీ రిక్రూట్‌మెంట్ తాలూకు గణాంకాలతో 'టెక్ వర్క్‌ఫోర్స్ ట్రెండ్స్: మహమ్మారి నుండి టెక్ వర్కర్స్ మరియు టెక్ ఉద్యోగాల వలసలు' పేరిట ఈ నివేదికను విడుదల చేశాయి. ఈ ఏడాదిలో కాలంలో కెనడా వ్యాప్తంగా వివిధ ఐటీ సంస్థల్లో మొత్తంగా 32వేల మంది విదేశీ టెక్ నిపుణుల నియామకాలు జరిగాయి. వీరిలో అత్యధికంగా భారత్ నుంచి 15,097 మంది ఉన్నారు.

ఇక మన తర్వాత నైజీరియా 1,808 మందితో రెండో స్థానంలో ఉంది. కెనడా ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ కారణంగానే ఇంత భారీ మొత్తంలో విదేశీ ఐటీ నిపుణులు ఆ దేశానికి క్యూకట్టినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇక కెనడాలోని మిస్సిసాగా (Mississauga) ఐటీ రంగానికి నిలయంగా మారింది. అక్కడ ఉన్న దాదాపు 1000 ఐటీ కంపెనీలలో సుమారు 3లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. అలాగే మాంట్రియల్ (Montreal) కూడా టెక్ రంగంలో దూసుకెళ్తోంది. ఇక్కడ 2015-2020 మధ్య టెక్ ఎకోసీస్టం అనేది 31శాతం పెరుగుదలను నమోదు చేసింది.

మైగ్రేషన్ డేటా ప్రకారం.. ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు మొత్తం 1,900 మంది సాంకేతిక నిపుణులు మిస్సిసాగాను తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారు. అలాగే మాంట్రియల్ 959 మంది టెక్ వర్కర్లను స్వాగతించింది. అమెరికా నుండి కూడా కెనడా టెక్ ప్రతిభను పొందుతోంది. వాషింగ్టన్ డీసీ, బోస్టన్, చికాగో, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన అమెరికన్ నగరాల నుండి భారతీయ నిపుణులు (Indian Professionals) కెనడా ఐటీ కంపెనీల కోసం పనిచేస్తున్నట్లు తాజా రిపోర్ట్ వెల్లడించింది.

Kuwait: దేశం నుంచి వెళ్లగొడుతున్న ప్రవాసుల విషయంలో కువైత్ మరో కీలక నిర్ణయం..!

Updated Date - 2023-09-01T09:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising