ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: గల్ఫ్ దేశం షాకింగ్ రిపోర్ట్.. ఏడాది వ్యవధిలో రూ.1780కోట్ల ట్రాఫిక్ ఫైన్స్ వసూలు.. ఇందులో సింహాభాగం ప్రవాసులదేనట!

ABN, First Publish Date - 2023-11-16T09:41:45+05:30

గల్ఫ్ దేశం కువైత్ 2023లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic Violations) సంబంధించి జరిమానాల రూపంలో ఏకంగా 66 మిలియన్ దినార్లు (రూ. 1780కోట్లు) వసూలు చేసింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ ఉల్లంఘనల పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్-ఒటైబీ వెల్లడించారు.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ 2023లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic Violations) సంబంధించి జరిమానాల రూపంలో ఏకంగా 66 మిలియన్ దినార్లు (రూ. 1780కోట్లు) వసూలు చేసింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ ఉల్లంఘనల పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్-ఒటైబీ వెల్లడించారు. కాగా, వసూలైన ట్రాఫిక్ చలాన్ల (Traffic Challans) లో సింహాభాగం ప్రవాసులదేనని తెలిపారు. అందులోనూ ఎవరైతే శాశ్వతంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారో వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు (Fine) వసూలు అయినట్లు చెప్పారు. అయితే, ఇటీవల దేశ మొదటి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్.. ప్రవాసుల బకాయిల విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా ఇలా భారీ మొత్తంలో జరిమానాలు వసూలు కావడానికి ప్రధాన కారణమని ముహమ్మద్ సాద్ అల్-ఒటైబీ పేర్కొన్నారు.

Retirement visa: యూఏఈలోని ప్రవాసులకు పదవీ విరమణ వీసా.. దరఖాస్తు ఇలా..!


బకాయిలు చెల్లించకుండా ప్రవాసులు (Expats) దేశం దాటి వెళ్లడానికి వీల్లేదని మంత్రి తీసుకున్న నిర్ణయంతోనే ఇది సాధ్యమైందన్నారు. అలాగే ఈ ఏడాది తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 122 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం ట్రాఫిక్ ఉల్లంఘనలు పూర్తిగా ఆటోమెటిక్‌గా మారాయన్నారు. ఉల్లంఘన రిజిస్టర్ అయిన వెంటనే సిస్టమ్‌లో నమోదవుతుంది. 'సహేల్' యాప్ (Sahel App) ద్వారా క్షణాలలో ఉల్లంఘనదారునికి సందేశం వెళ్తుంది. ఉల్లంఘనల దర్యాప్తు విభాగంలో ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు. అలాగే సందేశంలో ఉండే లింక్ ద్వారా వెంటనే ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు.

Indian Students: గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. యూఎస్ వర్సిటీల్లో భారీగా పెరిగిన విదేశీ విద్యార్థులు.. మనోళ్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Updated Date - 2023-11-16T13:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising