ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saudi Arabia: వారం రోజుల్లో 11వేల మందికి పైగా అరెస్ట్.. ఉల్లంఘనదారులను ఉపేక్షించేది లేదంటున్న సౌదీ!

ABN, First Publish Date - 2023-10-03T08:44:43+05:30

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 11వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.

రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 11వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు. రెసిడెన్సీ, వర్క్, సరిహద్దు భద్రతా నిబంధనలు ఇలా పలు ఉల్లంఘనలకు పాల్పడిన 11,465 మంది ప్రవాసులను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా వారం రోజుల వ్యవధిలోనే (ఈ నెల 21 నుంచి 27 తేదీల మధ్యలో) ఇంత భారీ మొత్తంలో అరెస్టులు జరగడం గమనార్హం. ఇక అరెస్టైన వారిలో 7,199 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారు (Violations of Residency Laws) ఉన్నారు. మరో 2,882 మంది అక్రమంగా దేశ సరిహద్దు (Illegal Border Crossing) దాటారు. అలాగే 1,384 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించగా (Violations of Labor Laws).. 711 మంది పక్క దేశాల నుంచి ప్రవేశించినవారు ఉన్నారని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Saudi Interior Ministry) తన ప్రకటనలో పేర్కొంది.

ఇక అదుపులో తీసుకున్నవారిలో 52 శాతం మంది యెమెన్ దేశస్తులు (Yemenis) ఉండగా, 45 శాతం మంది ఇథియోపియన్, 3 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 43,772 మంది ఉల్లంఘనదారులపై విచారణ కొనసాగుతుందని మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. వీరిలో 36,404 మంది పురుషులు, 7,368 మంది మహిళలు ఉన్నారు. వారిలో 38,379 మంది ఉల్లంఘనదారులు ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు పంపించడం జరిగింది. ఇక చట్టపరమైన ప్రక్రియను పూర్తి అయిన 7,922 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు సౌదీ భద్రతా అధికారులు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. రవాణా, ఆశ్రయం కల్పించడంతో సహా ఎవరైనా కింగ్‌డమ్‌లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సహాయం చేసినట్లు తేలితే.. గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్ సౌదీ రియాళ్లు(రూ. 2.13కోట్లు) వరకు జరిమానా ఉంటుందని అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) హెచ్చరించింది. అలాగే వాహనాలను కూడా జప్తు చేయడం జరుగుతుందని తెలిపింది. ఇక అనుమానాస్పద ఉల్లంఘనలపై ఫిర్యాదు కోసం మక్కా, రియాద్ ప్రాంతాల వాసులు టోల్-ఫ్రీ నంబర్ 911కు, కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాల వారు 999 లేదా 996కు కాల్ చేయవచ్చని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

Kuwait: గల్ఫ్ దేశంలో ఊహించని పరిణామం.. అపార్ట్‌మెంట్స్ ఖాళీ.. బోరుమంటున్న యజమానులు..!


Updated Date - 2023-10-03T08:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising