Indians: ట్రేండ్ మారిందిగా.. భారతీయులకు ఏ గల్ఫ్ దేశం ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తుందో తెలుసా..?
ABN, First Publish Date - 2023-02-12T07:31:59+05:30
గత ఏడాది భారతీయులకు అత్యధికంగా పని కల్పించిన గల్ఫ్ దేశాల జాబితాలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో నిలిచింది.
భారత కార్మికులు సౌదీలోనే ఎక్కువ!
రియాధ్, ఫిబ్రవరి 11: గత ఏడాది భారతీయులకు అత్యధికంగా పని కల్పించిన గల్ఫ్ దేశాల జాబితాలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో నిలిచింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) గణాంకాల ప్రకారం.. మొత్తం 178,630మంది భారతీయులకు సౌదీలో గత ఏడాది పని లభించింది. 2021తో పోలిస్తే ఇది ఏకంగా ఐదింతలు ఎక్కువ కావడం గమనార్హం. ఈ జాబితాలో రెండవ స్థానంలో కువైత్ నిలిచింది. భారత్ నుంచి వలస వెళ్లినవారిలో 50శాతం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని ఓ అంచనా.
గతేడాది సౌదీ తరువాత కువేత్‌లోనే(Kuwait) అత్యధికంగా సుమారు 71 వేల మంది భారతీయులు ఉపాధి పొందారు. 2021తో పోలిస్తే 2022లో అక్కడ భారతీయ కార్మికుల సంఖ్య ఏకంగా ఏడు రెట్లు పెరిగింది. ఇదిలా ఉంటే..బహ్రెయిన్(Bahrain) అత్యల్పంగా 10,232 భారతీయులకు ఉపాధి కల్పించగలిగింది. ఇక.. 2018లో అత్యధికంగా 1.12 లక్షల మంది భారతీయులకు ఉపాధి అవకాశాలు దక్కిన కువైత్‌లో గతేడాది కేవలం 33,233 మంది మాత్రమే ఉపాధి పొందగలిగారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. భారత్ నుంచి వలసెళ్లిన వారిలో 50 శాతం గల్ఫ్ దేశాల్లోనే ఉపాధి పొందుతున్నారు. ఇక గల్ఫ్ దేశాల్లోని 70 శాతం మంది సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ వర్కర్సే. వృత్తి నిపుణులు, వైట్ కాలర్ సిబ్బంది వాటా 20 నుంచి 30 శాతం వరకూ ఉంటుంది. అతికొద్ది మంది మాత్రం స్థానికుల వద్ద సహాయకులుగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో..
Updated Date - 2023-02-12T07:32:01+05:30 IST