ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయ డ్రైవర్‌దే.. ఒక్కసారి లాటరీ తగలడమే కష్టం అనుకుంటే.. మనోడికి ఏకంగా..

ABN, First Publish Date - 2023-09-23T11:59:08+05:30

అబుదాబి బిగ్ టికెట్ (Big Ticket) వీక్లీ డ్రాలో భారతీయ డ్రైవర్ (Indian Driver) జాక్‌పాట్ కొట్టాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో అబుదాబిలో స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత ప్రవాసుడు రియాస్ పరంబత్‌కండి 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో రూ.22.60లక్షలు. కాగా, అతడు బిగ్ టికెట్ లాటరీలో ఇలా జాక్‌పాట్ కొట్టడం ఇది రెండోసారి.

అబుదాబి: అబుదాబి బిగ్ టికెట్ (Big Ticket) వీక్లీ డ్రాలో భారతీయ డ్రైవర్ (Indian Driver) జాక్‌పాట్ కొట్టాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో అబుదాబిలో స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత ప్రవాసుడు రియాస్ పరంబత్‌కండి 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో రూ.22.60లక్షలు. కాగా, అతడు బిగ్ టికెట్ లాటరీలో ఇలా జాక్‌పాట్ కొట్టడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2012లో కూడా ఒకసారి మనోడికి లాటరీ తగిలింది. ఇలా అతనికి రెండోసారి అదృష్టం కలిసొచ్చి భారీ ప్రైజ్‌మనీ సొంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన రియాస్ 17 ఏళ్ల నుంచి అబుదాబి (Abu Dhabi) లో ఉంటున్నాడు. 2008 నుంచి బిగ్ టికెట్ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. 15 మంది స్నేహితులతో కలిసి క్రమం తప్పకుండా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. ఈ స్నేహితుల బృందం తొలిసారి 2012లో 40వేల దిర్హమ్స్ (రూ.9లక్షలు) గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పుడు 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా రియాస్ మాట్లాడుతూ.. "ఇలా భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మళ్లీ గెలుస్తానని నాకు తెలుసు. నేను పనిలో ఉన్నందున బిగ్ టికెట్ నిర్వాహకుల కాల్‌కి సమాధానం ఇవ్వలేకపోయాను. నా స్నేహితుడు బిగ్ టికెట్ వెబ్‌సైట్‌లో చూసి నా పేరు ఉందని చెప్పాడు. దాంతో వెంటనే నేను ఈ విషయాన్ని నా ఫ్యామిలీతో పంచుకున్నాను. వారందరూ ఎంతో ఆనంద పడ్డారు" అని అన్నాడు. ఇక తాను గెలుచున్న ఈ ప్రైజ్‌మనీని తన స్నేహితులతో పంచుకుంటానని చెప్పాడు. అలాగే తన భార్య, పిల్లలను రెండు నెలల అబుదాబి ట్రిప్‌నకు తీసుకువస్తాని చెప్పుకొచ్చాడు. ఇకపై కూడా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూనే ఉంటామని చెప్పిన రియాస్.. ఏదో ఒకరోజు గ్రాండ్‌ప్రైజ్ విన్ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

SalamAir: భారతీయ ప్రయాణికులకు ఒమాన్‌ ఎయిర్‌లైన్ షాక్.. అక్టోబర్ 1వ తారీఖు నుంచి అన్ని సర్వీసులు బంద్!


Updated Date - 2023-09-23T11:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising