ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: ఆ కార్మికులే లక్ష్యంగా భద్రతాధికారుల సోదాలు.. ఎట్టిపరిస్థితుల్లో అలాంటివారిని దేశంలో ఉండనివ్వరట!

ABN, First Publish Date - 2023-09-16T08:15:27+05:30

రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రవాస కార్మికులపై కువైత్ (Kuwait) భద్రతాధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస తనిఖీలతో బెంబెలెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కువైత్ సిటీ: రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రవాస కార్మికులపై కువైత్ (Kuwait) భద్రతాధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస తనిఖీలతో బెంబెలెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పాన్సర్ల నుంచి వెళ్లిపోయి కననిపించకుండా పోయే కార్మికులే (Absconding Workers) లక్ష్యంగా సెక్యూరిటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రెసిడెన్సీ అఫైర్స్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. తనిఖీలలో పట్టుబడిన ఉల్లంఘనదారులకు ఆర్టికల్ 20 (గృహకార్మికులు) ప్రకారం దేశ బహిష్కరణకు (Deportation) సిఫార్సు చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఇక కార్మికులు ఎవరైతే వారి అసలు స్పాన్సర్‌ల నుండి పారిపోయి చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ పర్మిట్‌లు (Residency Permits) లేకుండా పొలాలు, వేశ్యాగృహాలు, స్టాల్స్, దుకాణాలలో ఉపాధి పొందుతారు. అలాంటివారు సెక్యూరిటీ అధికారుల (Security Officials) కంటబడకుండా ఉంటున్నట్లు భావించడం జరుగుతుంది. కానీ, ఇకపై అలాంటివారి పప్పులు ఉడకబోవని నిత్యం సోదాలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అంతేగాక ఇకపై ఇలా కనిపించకుండాపోయే వర్కర్లే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే పరారీలో ఉన్న వారికి ఆశ్రయం కల్పించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు (Legal action) తీసుకుంటామని హెచ్చరించారు.

Kuwait: దేశవ్యాప్తంగా సెక్యూరిటీ సోదాలు.. 595 మంది ప్రవాసులు అరెస్ట్..!


Updated Date - 2023-09-16T08:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising