Beware: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. కువైత్, సౌదీలో ఉండగా ఈ తప్పు మాత్రం చేయొద్దు..
ABN, First Publish Date - 2023-08-01T10:34:19+05:30
గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
ఎన్నారై డెస్క్: గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. లేనిపక్షంలో మనం తెలియకుండా చేసే పొరపాటు కూడా మనల్ని భారీ మూల్యం చెల్లించేకునేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా కువైత్, సౌదీ అరేబియా (Saudi Arabia) లో అమ్మాయిలకు సందేశాలు పంపించే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే ఒక సంఘటన తెరపైకి వచ్చింది. ఈ దేశాల్లో అమ్మాయిలకు సందేశాలు పంపించేటప్పుడు పొరపాటున కూడా 'హార్ట్ ఎమోజీ'లు పంపించకూడదు.
కువైత్ న్యాయవాది హయా అల్ షలాహి (Haya Al Shalahi) వివరణ ప్రకారం.. ఈ నేరానికి పాల్పడిన వారికి 2వేల కువైటీ దినార్ల (రూ.5.36లక్షలు) జరిమానాతో పాటు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. అలాగే సౌదీ అరేబియాలో కూడా ఈ తరహా నేరానికి భారీ జరిమానా ఉంటుంది. వాట్సాప్ (WhatsApp) ద్వారా అమ్మాయిలకు 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపించిన సందర్భంలో నేరం రుజువైతే 1లక్ష సౌదీ రియాళ్ల (రూ.21.93లక్షలు) జరిమానా, రెండు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. సౌదీ సైబర్ క్రైమ్ నిపుణుల ప్రకారం వాట్సాప్‌లో రెడ్ హార్ట్‌లను పంపడం దేశ అధికార పరిధిలో 'వేధింపు' (Harassment) గా పరిగణించబడుతుంది. సో.. ఈ రెండు దేశాలలో ఉండే ప్రవాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
NRI: ఆరు గల్ఫ్ దేశాల్లో 88.8లక్షల మంది భారత ప్రవాసులు.. అత్యధికం మాత్రం ఆ దేశంలోనే..
Updated Date - 2023-08-01T10:45:29+05:30 IST