ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Green Card: అమెరికా గ్రీన్‌కార్డు అందుకోకుండానే.. 4ల‌క్ష‌ల మంది భార‌తీయులు చనిపోతారట.. నివేదికలో విస్మయకర విషయాలు..!

ABN, First Publish Date - 2023-09-06T12:44:44+05:30

అగ్రరాజ్యం అమెరికా (America) లో శాశ్వత నివాసం అక్కడి ప్రభుత్వం గ్రీన్‌కార్డు (Green Card) జారీ చేస్తుంది. దీనికోసం యూస్ (US) ప్రతియేటా దేశాలవారీగా 'కోటా' విధానాన్ని అమలు చేస్తోంది.

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America) లో శాశ్వత నివాసం అక్కడి ప్రభుత్వం గ్రీన్‌కార్డు (Green Card) జారీ చేస్తుంది. దీనికోసం యూస్ (US) ప్రతియేటా దేశాలవారీగా 'కోటా' విధానాన్ని అమలు చేస్తోంది. దాంతో గ్రీన్‌కార్డు కోసం వేచిచూసే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఇక అమెరికాలో భారతీయులు భారీగానే ఉంటారనే విషయం తెలిసిందే. ఇప్పటికే మనోళ్లు భారీ మొత్తంలోనే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఓ అధికారిక నివేదిక విస్మయకర విషయాలను వెల్లడించింది.

అదేంటంటే.. గ్రీన్‌కార్డు అందుకోకుండానే సుమారు 4ల‌క్ష‌ల మంది వరకు భార‌తీయులు (Indians) ప్రాణాలు విడిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆ దేశానికి చెందిన క్యాటో ఇన్స్‌‌టిట్యూట్ రిపోర్ట్ (Cato Institute Report) వెల్ల‌డించింది. ప్రస్తుతం యూఎస్‌లో గ్రీన్‌కార్డు కోసం సుమారు 11ల‌క్ష‌ల మంది భార‌తీయుల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌‌లో ఉన్నాయట. అయితే, వారంద‌రికీ ఇప్ప‌ట్లో ఈ శాశ్వత రెసిడెన్సీ కార్డు అంద‌డం అసాధ్యం. అమెరికా ఎంప్లాయిమెంట్ శాఖ వ‌ద్ద మొత్తం 18 ల‌క్ష‌ల గ్రీన్ కార్డు ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉంటే.. వాటిలో 63 శాతం దర‌ఖాస్తులు మన వాళ్లవేనని తెలిసింది. వీటికి తోడు ఫ్యామిలీ సిస్ట‌మ్‌‌తో లింకు ఉన్న గ్రీన్‌కార్డులు సుమారు 83 ల‌క్ష‌ల వ‌ర‌కు పెండింగ్‌లో ఉన్న‌ట్లు సమాచారం.

కాగా, క్యాటో రిపోర్టు ప్ర‌కారం.. కొత్త‌గా గ్రీన్‌కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న భార‌తీయుల‌కు వేచిచూసే సమయం అనేది ఓ జీవిత‌కాల శిక్ష‌గా మార‌నున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ శాఖ వ‌ద్ద ఉన్న ద‌ర‌ఖాస్తుల్ని క్లియ‌ర్ చేయాలంటే దాదాపు 134 ఏళ్లు ప‌డుతుంద‌ట‌. దీంతో సుమారు 4.24లక్షల మంది గ్రీన్‌కార్డు కోసం ఎదురూచూస్తూ చనిపోవచ్చని, దీంట్లో 90 శాతం మంది ఇండియన్లే ఉంటారని నివేదిక తెలిపింది.

UAE: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. యూఏఈలో ఆ తప్పుకు రూ.2కోట్లకు పైగానే జరిమానా..!

Updated Date - 2023-09-06T13:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising