TANA: 'తానా' మహా సభలకు ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ఆహ్వానం
ABN, First Publish Date - 2023-04-28T09:01:22+05:30
అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'తానా' (TANA- Telugu Association of North America) నుంచి బీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్‌కు (MP Santosh Kumar) ప్రత్యేక ఆహ్వానం అందింది.
హైదరాబాద్: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'తానా' (TANA- Telugu Association of North America) నుంచి బీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్‌కు (MP Santosh Kumar) ప్రత్యేక ఆహ్వానం అందింది. జూలై అగ్రరాజ్యంలో జరగనున్న 23వ మహా సభలకు రావాల్సిందిగా సంతోష్ కుమార్‌ను 'తానా' సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సభలకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అమెరికాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో (Pennsylvania Convention Center) జూలై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ 23వ 'తానా' మహా సభలు జరుగనున్నాయి.
ఇక తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పట్ల 'తానా' సభ్యులకు ఎంపీ సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తనను ఆహ్వానించడానికి వచ్చిన 'తానా' సభ్యులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ ఎన్నారైల పాత్రను సంతోష్ కుమార్ ప్రశంసించారు. కాగా, 1977లో కాకర్ల సుబ్బారావు (Kakarla Subba Rao) ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన 'తానా'లో ఇప్పటివరకు 49వేల మంది వరకు సభ్యులు ఉన్నారు.
Diwali Holiday: ఇకపై దీపావళికి అమెరికాలోనూ హాలీడే.. న్యూయార్క్ బాటలోనే పెన్సిల్వేనియా!
Updated Date - 2023-04-28T09:01:22+05:30 IST