NRI: ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ..!
ABN, First Publish Date - 2023-09-08T10:08:17+05:30
ఆస్ట్రేలియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్‌గా గెలిచి తెలుగు మహిళ సంధ్య రెడ్డి (Sandhya Reddy) చరిత్ర సృష్టించారు.
ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్‌గా గెలిచి తెలుగు మహిళ సంధ్య రెడ్డి (Sandhya Reddy) చరిత్ర సృష్టించారు. తెలంగాణకు చెందిన ఆమె.. కౌన్సిలర్‌గా గెలుపొంది డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్‌గా ఎన్నికవ్వగా, కౌన్సిలర్‌గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్య రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.
ఈ సందర్భంగా సంధ్య రెడ్డి మాట్లాడుతూ.. ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో కౌన్సిలర్‌గా గెలుపొంది డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. స్ట్రాత్‌ఫీల్డ్‌లో ఆమె సుప్రసిద్ధ సంఘం నాయకురాలు. స్ట్రాత్‌ఫీల్డ్ కమ్యూనిటీ సెంటర్, స్ట్రాత్‌ఫీల్డ్ నైబర్‌హుడ్ వాచ్‌తో సహా నివాసితుల జీవితాలను మెరుగుపరచడానికి ఆమె అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. సంధ్య సామాజిక సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆమెకు 2020 సంవత్సరానికి 'స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు (Strathfield Citizen of the Year Award) తో సత్కరించింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్న సంధ్య రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఎన్నారైలు ఆకాక్షించారు. ఇక తెలంగాణ బిడ్డ సంధ్య రెడ్డిని ఎన్నారై కోఆర్డీనేటర్ మహేష్ బిగాల అభినందించారు. ఇది తెలంగాణ బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం అని కొనియాడారు.
Kuwait: వరుస తనిఖీలతో ప్రవాసులను బెంబెలెత్తిస్తున్న గల్ఫ్ దేశం.. ఇకపై అలాంటి వారు కువైత్ నేలపై ఉండకూడదంటూ..
Updated Date - 2023-09-08T10:08:17+05:30 IST