ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SATA: సౌదీలో భారత రాయబారితో తెలుగు ప్రవాసీ ప్రతినిధి బృందం 'సాటా' భేటీ

ABN, First Publish Date - 2023-09-20T07:22:15+05:30

సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్- SATA) ప్రతినిధి బృందం మంగళవారం రియాధ్ నగరంలో భారతీయ రాయబారి డాక్టర్ సోహెల్ ఏజాస్ ఖాన్‌తో సమావేశమైంది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్- SATA) ప్రతినిధి బృందం మంగళవారం రియాధ్ నగరంలో భారతీయ రాయబారి డాక్టర్ సోహెల్ ఏజాస్ ఖాన్‌తో సమావేశమైంది. భారతీయ ఎంబసీలో జరిగిన ఈ సమావేశంలో రాయబారి సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల సంక్షేమ, సాంస్కృతిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాయబారితో పాటు ఎంబసీలోని సీనియర్ దౌత్యవేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సాటా ప్రతినిధి బృందానికి ప్రధాన కార్యదర్శి ముజమ్మీల్ శేఖ్ నేతృత్వం వహించగా జి. ఆనందరాజు, కె. సూర్య, ఎర్రన్న, వినయ్, శ్రీదేవి, గీతా, సుచరిత, చేతన, సుధా, మోబీనా, అక్షితలు పాల్గొన్నారు. తెలుగు ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి విభిన్న ఆంశాలను చర్చించినట్లుగా ముజ్జమీల్ పేర్కొన్నారు. తెలుగు ప్రవాసీయుల బృందం ఈ రకంగా భారతీయ రాయబారితో అధికారికంగా సమావేశం కావడం సౌదీ అరేబియాలో ఇదే తొలిసారి కూడా. వివిధ సమస్యల పరిష్కారంలో తమకు తోడ్పాటును అందిస్తున్న భారతీయ రాయబారి డాక్టర్ సోహెల్, ఇతర దౌత్యవేత్తలను సాటా బృందం అభినందిస్తూ ప్రశంసించింది.

Updated Date - 2023-09-20T07:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising