ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telugu Student: చేతికి అందివచ్చిన కొడుకు.. విగతజీవిగా కనిపిస్తే.. ఆ తల్లిదండ్రుల బాధ వ‌ర్ణ‌నాతీతం!

ABN, First Publish Date - 2023-07-29T12:11:39+05:30

ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ వ‌ర్ణ‌నాతీతం.

ఎన్నారై డెస్క్: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ వ‌ర్ణ‌నాతీతం. చేతికి అందివచ్చిన కొడుకు అర్థాంతరంగా తనువు చాలిస్తే పేరెంట్స్ వేదన మాటల్లో చెప్పడం కష్టం. ఏపీకి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. వారి కుమారుడు కిరణ్ కుమార్ (Kiran Kumar) రెండేళ్ల క్రితం ఎంఏస్ చేయడానికి బ్రిటన్ వెళ్లాడు. అక్కడ అతణ్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శుక్రవారం కిరణ్ మృతదేహం స్వస్థలం గొడవర్రుకు చేరుకుంది. అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి, ఆ దంపతులు గుండెలవిసేలా రోదించారు. 'నాయనా కిరణ్ లేవరా' అంటూ వారు ఏడ్చిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. వారి కన్నీటిని, మనోవేదనను ఎవరూ ఆపలేకపోయారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్‌ కుమార్‌ తపాలశాఖలో (Postal Department) జాబ్ చేస్తున్నాడు. చిన్న కుమారుడు కిరణ్‌ కుమార్‌ (25) ఏలూరులో ఇంజినీరింగ్‌ చేశాడు. అనంతరం రెండున్నరేళ్ల కింద లండన్‌ వెళ్లి ఎంఎస్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం వేటలో పడిన అతడు.. నిపుణుల సూచన మేరకు కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజూ క్లాసులకు వెళ్తున్నాడు. రోజులానే జూన్‌ 26వ తారీఖున కూడా ద్విచక్రవాహనంపై క్లాస్‌కు వెళ్లేందుకు బయల్దేరాడు. అదే సమయంలో పోలీసులు ఓ దొంగను వెంటాడుతున్నారు. ఆ దొంగ వేగంగా వెళ్తూ.. కిరణ్‌ను ఢీకొట్టాడు.

US: అమెరికాలో పిడుగుపాటుకు గురైన.. ఈ తెలుగు యువతి విషయంలో నిజంగా అద్భుతమే జరిగింది..!


ఈ ఘటనలో కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో పోలీసులు అతణ్ని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక నెలపాటు వివిధ ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులు అక్కడి ప్రవాస భారతీయుల సహకారంతో కిరణ్‌ మృతదేహాన్ని లండన్‌ నుంచి స్వదేశానికి విమానంలో తరలించారు. మొదట కిరణ్ మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో శుక్రవారం ఉదయం గొడవర్రులోని ఇంటికి తరలించారు. అనంతరం హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కిరణ్‌ కడసారి వీడ్కోలుకు బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Emirates draw: అదృష్టం అంటే ఈ భారత ప్రవాసుడిదే.. ప్రతినెల రూ.5.60లక్షలు.. అది కూడా 25ఏళ్ల వరకు..!

Updated Date - 2023-07-29T12:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising