UK: బ్రిటన్‌లో ఇద్దరు భారత సంతతి టీనెజర్లకు 34ఏళ్ల జైలు.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..
ABN, First Publish Date - 2023-07-14T12:27:08+05:30
బ్రిటన్‌లో ఇద్దరు భారత సంతతి టీనెజర్లకు (Indian Origin Teens) వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్ట్ (Wolverhampton Crown Court) గురువారం 34ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
లండన్: బ్రిటన్‌లో ఇద్దరు భారత సంతతి టీనెజర్లకు (Indian Origin Teens) వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్ట్ (Wolverhampton Crown Court) గురువారం 34ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గతేడాది తోటి భారతీయ యువకుడిని పొడిచి చంపినందుకు గాను తాజాగా న్యాయస్థానం ఆ ఇద్దరు నిందితులకు జైలు శిక్షను ఖరారు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ (West Midlands) ప్రాంతంలోని వాల్వర్‌హాంప్టన్ (Wolverhampton) లో 2022 జూలైలో ఈ ఘటన జరిగింది. భారత సంతతికి చెందిన రోనన్ కంద (Ronan Kanda) అనే యువకుడిపై ఇద్దరు భారతీయ సంతతి టీనెజర్స్ కొడవలి, నింజా కత్తితో దాడి చేసి, పొడిచి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
ఇక స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని రోనన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, పోస్ట్‌మార్టంలో అతడు రెండుసార్లు కత్తిపోట్లకు గురై మరణించినట్లు వెల్లడైంది. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇద్దరు నిందితులు ప్రబ్‌జీత్ వేధస (Prabjeet Veadhasa), సుఖ్మాన్ షెర్గిల్ (Sukhman Shergill) లను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఈ కేసు వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా దోషిగా తేలిన ఇద్దరు ఇండియన్ టీనెజర్లకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. ప్రబ్‌జీత్‌కు 18 ఏళ్లు, సుఖ్మాన్‌కు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.
Kamala Harris: కమలా హ్యారిస్ పేరిట మరో అరుదైన రికార్డ్.. 191 ఏళ్ల అగ్రరాజ్యం చరిత్రలో ఇదే తొలిసారి..
Updated Date - 2023-07-14T12:27:08+05:30 IST