ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ABN Andhrajyothy: ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సిద్ధం

ABN, First Publish Date - 2023-10-07T14:40:18+05:30

ఫేక్‌గాళ్లకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్‌లో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడును. దోషులు ఎంతటి వారైన సరే వదిలేది లేదు.

హైదరాబాద్: సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ఫేక్ కంటెంట్‌కు కొదవ లేకుండా పోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్‌ను అడ్డుకునేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో ఫేక్ గాళ్లు రెచ్చిపోతున్నారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు, సంస్థల పేరు మీద ఫేక్ ఐడీలు సృష్టిస్తున్నారు. సదరు సంస్థల పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ఖాతాలను తెరస్తున్నారు. అచ్చం ఆ సంస్థల ఒర్జినల్ ఖాతాల మాదిరిగా ఫేక్‌వి కూడా ఉంటున్నాయి. సదరు సంస్థల పేరుతో వాటిలో తమకు ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. తద్వారా సదరు సంస్థలపై దుష్ప్రచారం చేస్తూ వాటి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా చేరింది. ఫేక్ గాళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో దుష్ప్రచారానికి తెరలేపారు. ఏబీఎన్ ఆంధ్యజ్యోతి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్‌లను సృష్టించి వార్తలను పోస్ట్ చేస్తున్నారు. తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సమాజంలో చెడ్డపేరు వచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు వ్యక్తులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫేక్ అకౌంట్‌తో అసత్యాలను ప్రసారం చేస్తున్నారు. తద్వారా ప్రజలను ఆందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫేక్‌గాళ్లపై చర్యలకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి నడుం బిగించింది. ఫేక్‌గాళ్లకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్‌లో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడును. దోషులు ఎంతటి వారైన సరే వదిలేది లేదు. ఇక నుంచి తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి వెనుకాడదు. కావున ఇక నుంచైన ఫేక్ గాళ్లు తమ పేరుతో అసత్య వార్తలు పోస్ట్ చేయడం మానుకోవాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హెచ్చరికలు జారీ చేస్తోంది.

Updated Date - 2023-10-07T14:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising