ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delimitation : కొత్త పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య పెంపు ప్రకటన వెనుక ఇంత పెద్ద కథుందా.. ఎవరికి లాభం.. అసలు మోదీ ప్లానేంటి..!?

ABN, First Publish Date - 2023-05-30T22:52:48+05:30

అవును.. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే ఆధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించాం.. ప్రస్తుత పార్లమెంట్‌ను 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే ఆధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించాం.. ప్రస్తుత పార్లమెంట్‌ను 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించాం.. భారతదేశ, ప్రపంచ వృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది.. కొత్త భవనాన్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడు.. ఇవీ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నోట వచ్చిన మాటలు. పార్లమెంట్ స్థానాలు పెంచుతామని మోదీ చెప్పారంతే కానీ.. ఎన్ని పెంచొచ్చు..? ఏయే రాష్ట్రాల్లో ఎంతవరకూ సంఖ్య పెరుగుతుంది..? అనే విషయాలపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే.. ఉత్తరాదిన (North Indian States), దక్షిణాదిన (South Indian states) ఇన్ని సీట్లు పెరగొచ్చు..? అసలు మోదీ టార్గెట్ ఏంటి..? అనే విషయాలపై అటు జాతీయ మీడియాలో.. ఇటు ప్రాంతీయ మీడియాలో.. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో వార్తలొస్తున్నాయి. ఈ సీట్ల పెంపు విషయంలో కేంద్రంపై ప్రతిపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంత్రి కేటీఆర్ స్పందించారు. అసలు మోదీ చేసిన ఒక్క ప్రకటన తర్వాత నడుస్తున్న చర్చేంటి..? ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

ఇదీ అసలు కథ..

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను గుర్తించడానికి పదేళ్లకు ఒకసారి జనగణన ప్రాతిపదికగా డీలిమిటేషన్‌ (Delimitation) ప్రక్రియ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభలోని 543 నియోజకవర్గాలను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించగా.. డీలిమిటేషన్‌ చట్టం-2002 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను 2026 దాకా నిలిపేయడం జరిగింది. అప్పట్లో జనాభా నియంత్రణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించగా.. దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించాయి. ఉత్తరాదిలో మాత్రం జనాభా విస్ఫోటనం సంభవించింది. దీంతో ఉత్తరాదిలోనూ జనాభా నియంత్రణ పద్ధతులు పాటించి జనాభా సమతుల్యత తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇప్పుడు గడువు దగ్గర పడుతుండటంతో 2026లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌ నియోజకవర్గాలను సవరించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ర్టాలు పార్లమెంట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేంద్రంపై.. రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జనాభా నియంత్రణలో గత 12 ఏళ్లుగా క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఇప్పుడు ఆ క్రమశిక్షణే పెద్ద రాజకీయ శిక్షగా మారబోతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఒకవేళ డీలిమిటేషన్‌ జరిగితే..!

డీలిమిటేషన్‌ జరిగితే.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh), బీహార్‌ (Bihar) వంటి అత్యధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ర్టాలకు లోక్‌సభ సీట్లు (Loksabha Seats) కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఉత్తరాదిన ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉంటాయని విశ్లేషకులు లెక్కలు తీస్తున్నారు. ఇక బీహార్ లెక్కలు తీస్తే.. రాష్ట్ర జనాభా 12.6 కోట్లు కాగా లోక్‌సభ సీట్లు 40. అంటే 32 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నారన్న మాట. ఈ లెక్కన ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను సవరిస్తే బీహార్‌ లోక్‌సభ స్థానాలు చ్చితంగా రెట్టింపవుతాయి. ఇలా ఉత్తరాదిన ఉండే అన్ని రాష్ట్రాల్లో భారీగానే సీట్లు పెరుగుతాయని తాజా జనాభాను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. అయితే నాడు జాతీయ ప్రయోజనాలను ఆశించి జనాభా నియంత్రణను పాటించిన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం పార్లమెంట్‌లో సీట్లు తగ్గనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మొత్తమ్మీద లెక్కలు చూస్తే.. డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ర్టాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గి.. ఉత్తరాదిలో పార్లమెంట్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇవన్నీ మోదీకి ప్లస్ కానున్నాయి. ఒకవేళ దక్షిణాదిన సీట్లు వచ్చినా రాకున్నా.. ఉత్తరాదిన వచ్చే సీట్లతో అధికారంలోకి వచ్చేయచ్చన్నది మోదీ మాస్టర్ ప్లానట (Modi Master Plan). ఇదే వర్కవుట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో.

మోదీ ప్రకటనపై విమర్శలు..!

మోదీ.. డీలిమిటేషన్‌ ప్రకటనపై కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాదిన బీజేపీకి అనుకూలంగా ఉంది గనుకే రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మోదీ ఇలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ డీలిమిటేషన్‌‌పై ఉత్తరాదిన ఉండే ప్రాంతీయ పార్టీలు మాత్రం అస్సలు స్పందించలేదు.

- తెలంగాణ మంత్రి కేటీఆర్ (TS Minister KTR) స్పందిస్తూ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘డిలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం.. బాధాకరం’ అని ట్విట్టర్‌లో కేటీఆర్ రాసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా నాయకులు, ప్రజలు గళమెత్తాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

- మరోవైపు.. ఇప్పుడే కేంద్రానికి దక్షిణాది అంటే చులకన.. డీలిమిటేషన్‌ జరిగితే మాత్రం భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల పరిస్థితి అగమ్యగోచరమని.. దీనిని దక్షిణ భారతదేశ ప్రజలు ఆలోచించాలని నెటిజన్లు చెబుతున్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

HayathNagar Murder Case : టీచర్ సుజాత-రాజేష్ ఎపిసోడ్‌లో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా..!

******************************

Delhi Liquor Scam Case : ప్చ్.. మొన్న పేరే లేదు.. ఇప్పుడు సడన్‌గా ఎమ్మెల్సీ కవిత విషయంలో బాంబ్ పేల్చిన ఈడీ..

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?

*****************************

Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Updated Date - 2023-06-01T15:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising