Telangana BJP : ఈటల రాజేందర్ బీజేపీకి అక్కర్లేదా.. మరీ ఇంత దారుణమా.. ఒక్కరూ పట్టించుకోలేదేం.. ఇదంతా దేనికి సంకేతం..!?
ABN, First Publish Date - 2023-06-30T19:11:19+05:30
తెలంగాణ బీజేపీకి (Telangana BJP) ఈటల అక్కర్లేదా..? రాజేందర్‌కు (Etela Rajender) బీజేపీ అవసరం లేదా..? అసలు ఆయన కమలం పార్టీలో ఉన్నారా..? లేదా..? కాషాయ పార్టీలో అసలేం జరుగుతోంది..? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ‘ప్రాణహాని ఉంది మహాప్రభో.. నన్ను కాపాడండి’ అని పదే పదే చెబుతున్నా..
తెలంగాణ బీజేపీకి (Telangana BJP) ఈటల అక్కర్లేదా..? రాజేందర్‌కు (Etela Rajender) బీజేపీ అవసరం లేదా..? అసలు ఆయన కమలం పార్టీలో ఉన్నారా..? లేదా..? కాషాయ పార్టీలో అసలేం జరుగుతోంది..? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ‘ప్రాణహాని ఉంది మహాప్రభో.. నన్ను కాపాడండి’ అని పదే పదే చెబుతున్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉన్న కమలనాథుల్లో (BJP Leaders) ఒక్కరంటే ఒక్కరీకి పట్టలేదు..! పైగా నిఘా పెట్టింది.. హత్యకు కుట్ర పన్నింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (BRS MLC Kaushik Reddy) అని ఈటల దంపతులిద్దరూ మీడియా ముందుకొచ్చి మొత్తుకున్నా సరే అస్సలు బీజేపీలో(BJP) చలనమే లేదు. ఎన్ని గొడవలున్నా, ఎన్ని గ్రూపులున్నా.. వర్గ విబేధాలున్నా.. ఈటల అనే వ్యక్తి పార్టీలో కీలక నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే అనే కనీసం జాలి, దయ కూడా లేకపోవడమేంటి..? అసలు ఇలాంటి పార్టీలో ఎందుకు ఉండాలి..? అంత గతిలేక ఉన్నామా..? అనేది ఇప్పుడు ఆయన అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు.
అసలేం జరుగుతోంది..?
ఇటీవల.. ఈటల, ఆయన సతీమణి జమున (Etela Wife Jamuna) ఇద్దరూ మీడియా మీట్ నిర్వహించి బీజేపీలో పరిస్థితి ఎలా ఉంది..? రాజేందర్‌ను టార్గెట్ చేసింది ఎవరు..? కౌశిక్ రెడ్డి ఆరోపణలు.. ఇలా అన్ని విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఈ క్రమంలోనే.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నట్టుగా ఈటల డీసీపీకి చెప్పారు. అంతేకాదు.. హుజురాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు వెళ్ళినపుడు అనుమానాస్పద కార్లు వెనక వస్తూ కనిపిస్తున్నాయని ఈటల డీసీపీకి వివరించారు. దీంతో.. అసలేం జరుగుతోంది.. ఇందులో నిజానిజాలెంత అని నిగ్గుతేల్చడానికి డీసీపీ రంగంలోకి దిగారు. ఈటలకు ముప్పు ఉందన్న విషయం నిజమేనని నిర్ధారణకు వచ్చిన డీసీపీ.. డీజేపీ అంజనీకుమార్‌కు నివేదిక సమర్పించారు. త్వరలోనే ఈటలకు వై కేటగిరి భద్రత (Y Category Security) ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) రంగం సిద్ధం చేస్తోంది. అయితే.. గత నాలుగైదు రోజులుగా ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని, కేంద్రంలోని ఒక్కరంటే ఒక్క నేత కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవడం గమనార్హం. కనీసం ఆయనకు అండగా నిలబడాల్సిన పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం మరీ దారుణం. కేంద్రంలో హోం మంత్రిగా ఉండే అమిత్ షా (Amit Shah) కూడా ఈ విషయంపై స్పందించలేదంటే అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
క్యాష్ చేసుకున్న బీఆర్ఎస్!
వాస్తవానికి ఈటల ఎపిసోడ్‌ను (Etela Episode) సీరియస్‌గా తీసుకుని ఉంటే.. బీజేపీకి పెద్ద ప్లస్సే అయ్యేదేమో కానీ ఆ వ్యక్తి ఈటల రాజేందర్ కావడంతో దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు కమలనాథులు. అంతేకాదు కనీసం భద్రత ఇవ్వాలని కానీ.. భద్రత మరింత పెంచాలని కానీ కూడా ఒక్క ప్రెస్‌మీట్ కానీ ప్రెస్ నోట్‌గానీ రిలీజ్ చేయకపోవడంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ (Minister KTR) రంగంలోకి దిగిపోయారు. ఈటల తనకు సోదరుడు లాంటి వారని చెప్పి.. వెంటనే డీజీపీకి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు ఈటలకు ప్రాణహాని ఉన్న విషయం నిజమేనని నిర్ధారణకు వచ్చారు. రేపో.. మాపో రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత కల్పించాలని చర్చలు నడుస్తున్నట్లు తెలియవచ్చింది. అంటే సొంత పార్టీ పట్టించుకోకపోయినా.. ఒకప్పుటి బీఆర్ఎస్సే ఈటలను పట్టించుకుని ఇదంతా చేయడంతో రాజేందర్ అభిమానులు, అనుచరులు కాసింత హ్యాపీగానే ఫీలవుతున్నారట. బీఆర్ఎస్ అంటే చాలు ఒంటికాలిపై లేచే బండి సంజయ్, అరవింద్, విజయశాంతి లాంంటి సీనియర్లు కూడా నోరు మెదపలేదు.
బీజేపీలో ఎందుకీ పరిస్థితి..?
రాజేందర్‌కు బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొన్నిరోజులకే సొంత పార్టీలోనే శత్రువులు పెరిగిపోయారు..! ముఖ్యంగా ఈటల వర్సెస్ బండి (Etela Vs Bandi) పరిస్థితులు రావడంతో రెండు వర్గాలుగా నేతలు విడిపోయిన పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ మధ్యే ఈటలకు ఢిల్లీ పెద్దలు కీలక పదవిలో కూర్చోబెట్టబోతున్నారని.. ఆ పదవి అధ్యక్ష పదవి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా హస్తినలో సీన్ క్రియేట్ అయ్యింది. దీనికోసం ఢిల్లీలోనే నాలుగైదు రోజులు ఈటల మకాం వేశారు. ఆయన హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు శుభవార్తతోనే వస్తారని అనుచరులు ఎంతగానో వేచి చూశారు. సీన్ కట్ చేస్తే.. అయితే పదవి రాలేదు.. ఆ ఊసెత్తడానికే కమలనాథులు సాహసించలేదు. ఇప్పుడు బీజేపీలో నెలకొన్న ఈ పరిస్థితుల మధ్య ఈటలకు ప్రాణహాని ఉందని రావడంతో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయినప్పటికీ బీజేపీ నేతల్లో ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈటలతో విబేధాలున్నా ఆయన సొంత పార్టీ నేత అని కూడా కనీసం ఒక్కరు కూడా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం ఎంతవరకు సబబో రాష్ట్ర నేతలకే తెలియాలి. బహుశా పార్టీ నుంచి పొమ్మనలేక ఇలా పొగబెడుతున్నారేమో అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే.. కమలం పార్టీలో ‘కల్లోల్లం’కు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో ఈటల ఏ నిర్ణయం తీసుకుంటారు..? సొంత గూటికి చేరుతారా లేకుంటే కాంగ్రెస్ కండువా చేరుతారా..? అనేది అనుచరులు, అభిమానులకే అర్థం కావట్లేదట. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరితే తగిన ప్రాధాన్యత ఉంటుందని కార్యకర్తలు పదేపదే ఈటలపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా.. బీజేపీలో ఏదో ఒక పరిణామం చోటుచేసుకున్నప్పుడల్లా ఈటల పార్టీకి గుడ్ బై చెబుతారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇంత జరిగాక ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా..? లేకుంటే ఇవన్నీ మామూలే అని బీజేపీలోనే కొనసాగుతారా..? అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Byreddy Vs Jagan : వైఎస్ జగన్‌కు బైరెడ్డి అల్టిమేటం.. నాలుగు ఆప్షన్లు ఇచ్చిన యువనేత.. దిక్కుతోచని స్థితిలో సీఎం.. ఏ నిమిషానికి..!
TS Congress : కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి నిజంగానే బీజేపీలో చేరుతున్నారా.. ఇదిగో ఫుల్ క్లారిటీ..
TS Congress : పొంగులేటిని ఒప్పించి కాంగ్రెస్‌లో చేరికకు చక్రం తిప్పిన ఈ ‘పెద్దాయన’ ఎవరబ్బా.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. హీరో వెంకటేష్‌కు ఏంటి సంబంధం..!?
Big Twist : ఓహో.. విజయసాయిని వైఎస్ జగన్ పక్కనపెట్టింది ఇందుకా.. పెద్ద కథే నడుస్తోందే..!?
TS Politics : ఈటలకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందా.. జమున కీలక ప్రకటన చేయబోతున్నారా.. అభిమానులు, అనుచరుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!
TS BJP : ‘కమలం’లో కల్లోల్లం.. గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైన ఎమ్మెల్యే రఘునందన్.. ఇదేగానీ జరిగితే..!
Updated Date - 2023-06-30T19:20:29+05:30 IST