YS Jagan : లెక్కలు తీసి మరీ పరువు తీసిన కేంద్రం.. సిగ్గో.. సిగ్గు మూడున్నరేళ్లలో సీఎం జగన్ కట్టిన ఇళ్లు ఎన్నో తెలిస్తే షాకే..!
ABN, First Publish Date - 2023-02-11T22:42:25+05:30
నవరత్నాల్లో (Navarathnalu) భాగంగా పేదలందరికీ ఇళ్లు ఇస్తాం.. మాది పేదల పక్షపాతి ప్రభుత్వం.. ఒకవేళ ఇళ్లు రాకున్నా అప్లయ్ చేసుకున్న 2 నెలల్లోనే అప్రూవల్ చేస్తాం.. ఇలా చెప్పుకుంటూ చాలానే ఊదరగొట్టారు సీఎం వైఎస్ జగన్ ..
నవరత్నాల్లో (Navarathnalu) భాగంగా పేదలందరికీ ఇళ్లు ఇస్తాం.. మాది పేదల పక్షపాతి ప్రభుత్వం.. ఒకవేళ ఇళ్లు రాకున్నా అప్లయ్ చేసుకున్న 2 నెలల్లోనే అప్రూవల్ చేస్తాం.. ఇలా చెప్పుకుంటూ చాలానే ఊదరగొట్టారు సీఎం వైఎస్ జగన్ (CM Jagan). సీన్ కట్ చేస్తే.. ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలాలు తీసి ఇళ్లు నిర్మించిందనే ఆరోపణలు లెక్కలేనన్నే వచ్చాయి. ఇప్పటి వరకూ అసలు ఎన్ని ఇళ్లు నిర్మించింది..? ఎంతమందికి స్థలాలు ఇచ్చిందనేది..? లెక్కలే లేవనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయ్. ఇలాంటి తరుణంలో కేంద్రం ఉన్నట్టుండి ఇళ్ల విషయంలో బాంబ్ పేల్చింది. రాజ్యసభ వేదికగా చేసిన కీలక ప్రకటన ఇప్పుడు ఏపీలోనే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ కేంద్రం చేసిన ఆ కీలక ప్రకటనేంటి..? ఎందుకింత చర్చనీయాంశమైందనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఇంతేనా..!
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం నిధులతో చేపట్టే పీఎంఏవై (PMAY) (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) ఇళ్లు ఏ రాష్ట్రం ఎన్ని నిర్మించింది..? ఏయే రాష్ట్రానికి ఎంతమేరకు నిధులు ఇచ్చాం..? అనే విషయాన్ని రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి నిరంజన్‌జ్యోతి వివరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 2 లక్షల 56 వేల 270 ఇళ్లను కేంద్రం కేటాయించింది. అంతేకాదు ఈ ఇళ్ల నిర్మాణానికి నిధులను కూడా పూర్తిగా విడుదల చేసేసింది మోదీ సర్కార్. అయితే జగన్ సర్కార్ మాత్రం 2019 నుంచి 2020 మధ్యలో కేవలం ఐదంటే ఐదు ఇళ్లు మాత్రమే నిర్మించింది. 2022-23 మధ్యలో 818 ఇళ్లను మాత్రమే పేదలకు కట్టించింది.
నిధులు ఏమయ్యాయ్..?
దేశంలో ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున పీఎంఏవై కింద పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మిస్తుండగా ఏపీ మాత్రం నిధులు లేకపోవడంతో వాటి జోలికి పోలేదని చెబుతోంది. అయితే.. కేంద్రం హౌసింగ్ ప్రాజెక్ట్ కింద రిలీజ్ చేసిన ఆ నిధులు ఏమయ్యాయి..? ఎక్కడ ఖర్చు చేశారు..? దేనికి ఖర్చుపెట్టారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే.. ఇప్పటికే పంచాయతీ నిధులు, కరోనా నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం రిలీజ్ చేసిన ఈ నిధులు కూడా అలాగే దారి మళ్లించారా..? లేకుంటే మరేం చేశారనేది తెలియట్లేదు.
అప్పుడు.. ఇప్పుడూ..!
అయితే.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మాత్రం సుమారు 47వేలకు పైగా ఇళ్లను పీఎంఏవై కింద నిర్మించింది. దీంతో వైసీపీ ప్రభుత్వం కన్నా.. ముందున్న టీడీపీనే మంచిగా ఇళ్లు నిర్మించిందని విమర్శలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం చెప్పే గొప్పలేమో ఓ రేంజ్‌లో ఉంటాయ్.. తీరా ఆచరణలో మాత్రం ఎలా ఉంటుందనేదానికి ఇదే నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు.. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తుండగా.. ఒక్కో ఇంటికి కేంద్రం రూ. 1.80 లక్షలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 30వేలు మాత్రమే మంజూరు చేస్తోంది. కేంద్రమే ఎక్కువ భాగం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం జగన్ పేరును ట్యాగ్ చేసి ‘జగనన్న కాలనీలు’ (Jaganna Colonies)అని చెప్పుకుంటోందని ఎప్పట్నుంచో బీజేపీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది.
మొత్తానికి చూస్తే.. రాజ్యసభా (Rajyasabha) వేదికగా లెక్కలు చెప్పి మరీ కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇంత జరిగినా ఇంతవరకూ ఈ ఇళ్ల వ్యవహారంపై కానీ.. నిధుల విషయంపై కానీ వైసీపీ (YSRCP) నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో.. మౌనానికి అర్థం అంగీకారమే కదా.. నిధులన్నీ ఖర్చు పెట్టాల్సిన రీతిలో పెట్టేశారుగా అనే ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది. మరోవైపు.. ఎక్కడా అప్పులు పుట్టక డబ్బులు.. డబ్బులు అని ఉన్న జగన్ సర్కార్ కేంద్రం నుంచి ఎంత వస్తే అంత పక్కదారి పట్టించేస్తోందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోయిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తు్న్నాయి.
Updated Date - 2023-02-12T00:08:11+05:30 IST