ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh : వై‘చీప్’ పాలిట్రిక్.. లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం.. ఇంత పైత్యం ఎందుకో..!?

ABN, First Publish Date - 2023-09-18T21:22:44+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌ను (Nara Lokesh Arrest) కూడా అరెస్ట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో (Social Media) వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి..

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును (Nara Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Illegal Case) అరెస్ట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో ఏపీ అట్టుడుకుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉండే అన్ని రంగాల ప్రముఖులు బాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాదు.. బాబు మద్దతుగా, జగన్ సర్కార్ (Jagan Govt) తీరును ఎండగడుతూ విదేశాల్లో సైతం నిరసనలు చేపడుతున్నారు. ఇదిలా నడుస్తుండగానే.. వైసీపీ మరో చీప్ పాలి‘ట్రిక్స్’ (YSRCP Cheap Politrics) మొదలెట్టింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌ను (Nara Lokesh Arrest) కూడా అరెస్ట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో (Social Media) వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక వాట్సాప్ గ్రూపుల్లో అయితే.. ఇప్పుడీ వ్యవహారంపైనే వైసీపీ కార్యకర్తలు చర్చిస్తున్నారు.


ఇంతకీ ఏమిటా ప్రచారం..?

వైసీపీ శ్రేణులు పైత్యంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వార్తల్లో ఏముంది..? అనేది యథావిధిగా..

:- లోకేశ్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందా...?

:- లోకేశ్ ను అరెస్ట్ చేయనున్నారని విస్తృత ప్రచారం

  • ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేశ్

  • లోకేశ్ రాజమండ్రి చేరుకోగానే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని విస్తృత ప్రచారం

  • లోకేశ్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారని ప్రచారం

  • మరోవైపు ఇప్పుడే తొందరపడి లోకేశ్ ను అరెస్ట్ చేయరంటూ మరో ప్రచారం

  • చంద్రబాబు అరెస్ట్ తో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత

  • అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మదింపు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

  • ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం

  • ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర...?

  • ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్

  • అరెస్టయిన వారికి న్యాయస్థానాల్లో బెయిల్

  • రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసు పెండింగ్

  • ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం

ఓహో ఇదా అసలు సంగతి!

అక్రమ కేసులో తన తండ్రిని అరెస్ట్ చేశారని హస్తిన వేదికగా జగన్ ప్రభుత్వ తీరును లోకేష్ ఎండగడుతున్నారు. ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఢిల్లీ నుంచి వరుస ట్వీట్లు చేయడం.. ఇక పార్లమెంట్ సమావేశాల్లో ఎలా ముందుకెళ్లాలి..? చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎవరెవరు ఏం మాట్లాడాలనే దానిపై లోకేష్ దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇవాళ ఇదే విషయం పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది కూడా. మరోవైపు.. పార్టీ ఎంపీలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు లోకేష్. వరుసగా భేటీలు, ఇంటర్వ్యూలతో బిజిబిజీగా ఉన్న లోకేష్ గురించే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదంతా డైవర్ట్ చేయడానికి వైసీపీ కుట్ర పన్నుతూ అసలు విషయాలను బయటికి రానివ్వకూడదని.. ‘ఢిల్లీ నుంచి రాగానే లోకేష్ అరెస్ట్’ అంటూ వైచీప్ పాలిట్రిక్స్‌కు దిగిందనే విషయం క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు.

ఇంత పైత్యం ఎందుకో..?

చంద్రబాబును అక్రమ కేసు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఆయన టీమ్.. టీడీపీ లీగల్ టీమ్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు లోకేష్ కూడా ఢిల్లీ వేదికగా.. ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలనేదానిపై న్యాయనిపుణులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు నిరసనలు.. మరోవైపు వరుస చర్చలతో బిజిబిజీగా ఉండటంతో తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో లోకేష్ హెడ్డింగ్స్‌లో నిలుస్తున్నారు. లోకేష్ పేరు ఎక్కడా వినిపించకూడదని భావించిన వైసీపీ శ్రేణులు ఇలా అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారానికి తెరలేపాయని టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని.. పైత్యపు ప్రచారాన్ని అంతే రీతిలో టీడీపీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. ఇందుకు కౌంటర్‌ ఇస్తూ.. అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ కూల్చడాలు, అక్రమ అరెస్టులు తప్ప.. నీతిగా నిజాయితీగా ఎదుర్కోలేని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత..? అసలు ఈ నాలుగన్నరేళ్లలో ప్రజల కోసం చేసింది ఏమైనా ఉందా..? అని దిమ్మదిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు. ‘చినబాబు రాజమండ్రి వస్తున్నాడు.. దమ్ముంటే టచ్ చేసి చూడండి’ అంటూ టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!


TS Assembly Polls : కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా కాంగ్రెస్ ఎన్నికల హామీలు.. ఈ దెబ్బతో..!?


CBN Arrest : వినాయక చవితి రోజున టీడీపీ ఆసక్తికర ట్వీట్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ


Updated Date - 2023-09-18T21:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising