Bandi Sanjay : ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చెప్పిందే జరిగింది.. కేంద్ర కేబినెట్‌లోకి ‘బండి’.. అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. ఈటల పరిస్థితేంటంటే..!?
ABN, First Publish Date - 2023-07-03T18:21:46+05:30
అవును.. గత వారం, పదిరోజులుగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన ప్రత్యేక కథనాలు అక్షరాలా నిజమయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తూ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్రం ఖరారు చేసింది..
అవును.. గత వారం, పదిరోజులుగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన ప్రత్యేక కథనాలు అక్షరాలా నిజమయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తూ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్రం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. అయితే ఈయనకు ఇప్పుడున్న కేంద్ర మంత్రి పదవి కూడా కొనసాగింపు ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పదవి స్వీకరించడానికి కిషన్ రెడ్డి.. విముఖత చూపినప్పటకీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత బీఎల్ సంతోష్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యి ఒప్పించినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్‌లోకి బండి..
కాగా.. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంది అధిష్టానం. బండికి కేంద్ర మంత్రిగా అగ్రనేతలు ప్రమోషన్ ఇచ్చారు. కేంద్ర సహాయక మంత్రిగా నియమించినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది కానీ.. ఏ శాఖ కేటాయించారన్న విషయం మాత్రం తెలియరాలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కాసేపట్లో అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రిపదవికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. ఉంటే అధ్యక్షుడిగా లేకుంటే ఏ పదవీ తనకొద్దనీ సామాన్య కార్యకర్తగానే పార్టీ కోసం పనిచేస్తానని తన అత్యంత సన్నిహితుల వద్ద బండి తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన వచ్చాక బండి ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై అభిమానులు, తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈటలకు ఇలా..?
ఇదిలా ఉంటే.. మొదట్నుంచీ అనుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా అగ్రనాయకత్వం ప్రకటించబోతోంది. రెండు మూడ్రోజులుగా ఈటల యమా యాక్టివ్‌గా ట్వీట్లు చేయడం, బీజేపీ నేతలతో వరుసగా భేటీలు కావడం.. అది కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని సైతం స్వయంగా ఇంటికెళ్లి మరీ రాజేందర్ కలుస్తున్నారు. అయితే కిషన్ రెడ్డి పదవి స్వీకరించడానికి సానుకూలంగా లేకపోతే తర్వాతి ఆప్షన్‌గా ఈటల రాజేందర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఏబీఎన్ టీవీ చానెల్, ఆంధ్రజ్యోతి.కామ్, ఆంధ్రజ్యోతి దినపత్రికలో బండికి ప్రమోషన్, ఈటలకు కీలక పదవి, కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవికి సంబంధించి వరుసగా ప్రత్యేక కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చెప్పినట్లుగానే అన్నీ జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్దమైంది. ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన సెంటర్‌లో జరుగుతున్న ఈ కేంద్ర మంత్రిమండలి భేటీ రాత్రి 9గంటల వరకూ సుదీర్ఘంగా జరగనుంది. ఈ సమావేశంలో 9 ఏళ్ళ పాలన, రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై పాటు.. పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యాతాంశాలపై కూడా చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురాబోతున్న కీలక బిల్లులు, పలు కీలక విషయాలపై మోదీ మాట్లాడుతున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్తాయి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై సమావేశంలోనే చర్చించగా.. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మార్పుల గురించి బయటికి లీకులు వచ్చాయి. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, ప్రక్షాళనలపై గత 6 నెలలుగా పలు సందర్భాల్లో ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. 2019లో రెండోసారి ప్రధాని అయ్యాక ఒకేసారి మాత్రమే కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరిగాయి. అయితే.. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఐదేళ్లలో 3సార్లు మంత్రివర్గ మార్పులు, చేర్పులు జరిగాయి. ఇప్పుడు మార్పులు జరిగితే రెండుసార్లు చేర్పులు జరిగినట్లవుతుంది.
ఇవి కూడా చదవండి
TS Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఇవన్నీ అందులో ఉంటాయా.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..!?
ఇవి కూడా చదవండి
TS BJP : హమ్మయ్యా.. ఈటలకు కీలక పదవి వచ్చేసిందిగా.. ఒక్క ట్వీట్‌తో కన్ఫామ్ చేసేసిన రాజేందర్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!
TS BJP : తెలంగాణ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి వద్దన్నారా.. అగ్రనేతల ఆలోచనేంటి.. ‘బండి’ ముందు రెండు ఆప్షన్లు.. రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..!?
AP Politcs : ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అంబటి రాయుడు ఫొటో.. అసలు విషయమేంటో తెలిస్తే..!
Minister KTR : ఏంటిది సారూ.. టచ్ చేయకూడదా..? దండం పెట్టినా ఎందుకిలా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Byreddy Vs Jagan : వైఎస్ జగన్‌కు బైరెడ్డి అల్టిమేటం.. నాలుగు ఆప్షన్లు ఇచ్చిన యువనేత.. దిక్కుతోచని స్థితిలో సీఎం.. ఏ నిమిషానికి..!
OHRK : రాహుల్ సభలో ప్రత్యేక ఆకర్షణగా పొంగులేటి.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ
Updated Date - 2023-07-03T18:29:53+05:30 IST