ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palamuru: ప్రభంజనంలా బీజేపీ కార్నర్‌ మీటింగ్‌లు..మెజారిటీ స్థానాల్లో గట్టిగా పోరాడాలని ఫిక్స్..?

ABN, First Publish Date - 2023-03-01T09:14:28+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై కమలనాథులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. అయితే.. పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలున్నా.. బీజేపీకి పట్టున్న స్థానాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉమ్మడి పాలమూరు జిల్లాపై కమలనాథులు కన్నేశారా?.. మెజారిటీ స్థానాల్లో గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారా?.. అంతో ఇంతో బలమున్న సీట్లతోపాటు.. కొత్త వాటి కోసమూ స్కెచ్చేస్తున్నారా?.. ప్రత్యేకించి.. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని చాలెంజ్‌గా తీసుకుంటున్నారా?.. అక్కడ పోటీ చేసేందుకు దిగ్గజ నేతలు రెడీ అవుతున్నారా?.. ఇంతకీ.. పాలమూరుపై కమలం పార్టీ ఎందుకు కన్నేసింది?.. మహబూబ్‌నగర్‌ సీటును టార్గెట్ చేయడం వెనకున్న ఆంతర్యమేంటి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

అభ్యర్థులను బట్టి బలాబలాలు తారుమారు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై కమలనాథులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. అయితే.. పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలున్నా.. బీజేపీకి పట్టున్న స్థానాలు మాత్రం సగానికి తక్కువే అని చెప్పొచ్చు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని కల్వకుర్తి నియోజకవర్గంలో మాత్రమే ఆ పార్టీ నేత తల్లోజు ఆచారి.. గత రెండు, మూడు ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మిగతా స్థానాల్లో బీజేపీ ఎక్కడా కనీస పోటీ కూడా ఇవ్వలేదు. కానీ.. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ పరిధిలో మాత్రం బీజేపీ అత్యధిక స్థానాల్లో ఫలితాన్ని డిసైడ్‌ చేసే పార్టీగా ఉంది. అయితే.. అభ్యర్థులను బట్టి ఆ పార్టీ బలాబలాలు తారుమారు అవుతాయన్న ప్రచారం జరుగుతోంది. మహబూబ్‌నగర్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కొడంగల్‌ తప్ప అన్ని చోట్లా కాస్తో కూస్తో బీజేపీకి బలం ఉంది. మఖ్తల్‌, నారాయణపేటలో పట్టున్నా.. గత రెండు, మూడు ఎన్నికల్లో అదృష్టం కలిసిరాలేదు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 5 వేల ఓట్ల మెజారిటీ

మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పూర్తిగా పట్టణ ఓటర్లు ఉండడం.. అందులోనూ.. మతాల ప్రాతిపదికన ఓట్లు పడుతుండడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారుతోంది. 2012 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తరపున ఇబ్రహీం అనే ఓ మైనారిటీ నేత, బీజేపీ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేయగా ఓటర్లు మత ప్రాతిపదికన చీలిపోవడంతో కమలం పార్టీ విజయం సాధించింది. అయితే.. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్‌కి 57 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ వచ్చింది. కానీ.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాస్‌ లీడర్‌ డీకే అరుణ పోటీ చేయగా.. 5 వేల ఓట్ల మెజారిటీ కట్టబెట్టారు.

బీఆర్ఎస్‌ నుంచి అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వ్యాపారవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేయగా.. ఓటర్ల మాత్రం డీకే అరుణ వైపే మొగ్గుచూపారు. ఈ లెక్కన.. రెండు ప్రధానాంశాలు డీకే అరుణకు కలిసి వచ్చాయని చెప్పొచ్చు. మోదీని తిరిగి ప్రధానిగా చూడాలనుకున్న అత్యధిక ఓటర్లు.. పాలమూరులో ఫైర్‌బ్రాండ్‌ పక్షానే నిలిచారు. అలా.. రెండు సందర్భాల్లో పాలమూరు ప్రజలు బీజేపీని ఆదరించారు.

గతంలో రూ.50 కోట్లిస్తే కేంద్రం రూ.240కోట్లు ఇచ్చినట్లు వెల్లడి

ఇదిలావుంటే.. పాలమూరులో రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న బీజేపీ.. ఈ సారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. అందుకే.. ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ప్రస్తుతం ప్రజా గోస- బీజేపీ భరోసా అనే కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. కార్నర్‌ మీటింగ్‌లు కూడా కొనసాగుతున్నాయి. అన్ని చోట్ల ఎలా ఉన్నా.. పాలమూరు జిల్లాలో మాత్రం.. కార్నర్‌ మీటింగ్‌లు ప్రభంజనంలా కొనసాగుతున్నాయి. ప్రతి కార్నర్‌ మీటింగ్‌కి ఈటెల రాజేందర్‌, డీకే అరుణ, జితేందర్‌రెడ్డిలాంటి అగ్ర నేతలు హాజరవుతూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక కార్నర్‌లో మీటింగ్‌ నిర్వహిస్తూ.. పాలమూరును చుట్టేస్తున్నారు. ఇప్పటికే.. బీఆర్ఎస్‌ నేతను టార్గెట్‌ చేస్తూ జనంలోకి వెళ్తున్నారు.

నిజానికి.. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం గతానికి.. ఇప్పటికీ చాలా మార్పు చెందింది. పలు అభివృద్ది పనులు జరిగాయి. ఆ పనులన్నీ ముందుండి చేయించినట్లుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పలు సమావేశాల్లో చెబుతూ వస్తున్నారు. ఆ స్థాయిలో అభివృద్ది పనులు గతంలో ఏవరూ చేపట్టలేదన్న అభిప్రాయం ప్రజల్లోనూ ఏర్పడింది. కానీ.. ఇప్పుడు బీజేపీ అదే అంశాలను టార్గెట్ చేస్తోంది. జాతీయ రహదారి కేవలం కేంద్రంలోనున్న బీజేపీతోనే సాధ్యం అయిందని.. అప్పట్లో కేవలం 50 కోట్ల నిధులే కేటాయించగా.. ఎంపీగా ఉన్న జితేందర్‌రెడ్డి చొరవతో 240 కోట్లు మంజూరు చేసిందని జనాల్లోకి తీసుకెళ్తున్నారు.

మంత్రికి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం

ఇక.. అప్పన్నపల్లి రెండో ఆర్‌ఓబీ నిర్మాణదశలో ఉంది. అక్కడికి శ్రీనివాస్‌గౌడ్‌ తరచూ వెళ్లి పనులను సమీక్షిస్తుండడం చర్చగా మారుతోంది. ఆ అంశాన్ని కూడా బీజేపీ సీరియస్‌గా పరిగణిస్తోంది. అది జాతీయ ప్రాజెక్టని.. మంత్రికి పనేంటని ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. గతంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రతినిథుల సభకు బండి సంజయ్‌ను కూడా రప్పించారు. ఆ క్రమంలో.. అభివృద్ధికి మంత్రికి ఎలాంటి సంబంధం లేదని ఆ బ్రిడ్జ్‌ త్వరలోనే పూర్తవుతుందని, ప్రారంభానికి మోదీ వస్తారని బండితో ప్రకటింపజేశారు. అన్ని పనులూ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని, కేవలం పర్యవేక్షణ బాధ్యత మాత్రమే తెలంగాణ ప్రభుత్వానిదని బీజేపీ నేతలు జనాలను ఆకర్షించే పనిలో ఉన్నారు. పాలమూరులో జరిగే అభివృద్ధి అంతా బీజేపీ వల్లేనంటూ ప్రకటనలు చేస్తున్నారు.

గద్వాల కంటే పాలమూరే సేఫ్‌ ప్లేస్‌ అని భావన

మరోవైపు.. మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశంలోనూ బీజేపీ క్లారిటీతో ఉందని తెలుస్తోంది. గతంలో రెండు సార్లు ఆధిపత్యాన్ని చాటిన అంశాలను పరిగణనలోకి తీసుకుని, జనాకర్షక నేతనే పోటీలో ఉంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా గత 50 ఏళ్లలో బీసీలే ఎక్కువసార్లు గెలిచారు. కేవలం మూడు సార్లు మాత్రమే రెడ్లు విజయం సాధించారు. అది కూడా పూర్తి ఐదేళ్లూ నిలవలేదు. ఆ లెక్కన.. బీసీని బరిలో దింపాలనుకుంటే.. ఎవరని ఎంచుకుంటారన్నది ఆసక్తిగా మారుతోంది. అదే సమయంలో.. డీకే అరుణ అయితేనే.. శ్రీనివాస్‌గౌడ్‌కు గట్టి పోటీ ఇస్తారని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పలు సమావేశాలకు డీకే అరుణ హాజరవుతుండడం బలం చేకూర్చుతోంది. ఎమ్మెల్యేగానే పోటీలో ఉండాలనుకుంటే.. సొంత ఇలాకా అయిన గద్వాల కంటే పాలమూరే సేఫ్‌ ప్లేస్‌ అని డీకే అరుణ కూడా ఆలోచిస్తున్నట్లు చర్చలు సాగుతున్నాయి.

మొత్తంగా.. పాలమూరు జిల్లాపై కమలనాథులు గట్టిగానే ఫోకస్‌ చేశారు. అందులోనూ.. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యర్థులు ఎవరనే విషయం పక్కనబెడితే.. బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంటుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. వచ్చే ఎన్నికల నాటికి పాలమూరు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Updated Date - 2023-03-01T09:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!