TS Assembly Polls : కాంగ్రెస్ భారీ స్కెచ్.. బీఆర్ఎస్, బీజేపీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యేలు, కీలక నేతలు వీరేనా..!?
ABN, First Publish Date - 2023-09-07T22:12:53+05:30
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్‌లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. దీంతో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్‌లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. దీంతో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక బీజేపీలోని నేతలు సైతం అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ (BRS, Congress) తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే బీజేపీ (BJP) పరిస్థితి బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉండగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఏ స్థానంలో ఉందో కూడా తెలియని పరిస్థితి. దీంతో కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చినట్లయ్యింది. ఇక అందరికంటే ముందుగా, వ్యూహాత్మకంగా ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) హ్యాట్రిక్ కొట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో పేర్లు లేని నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. మరికొందరు ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్లడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు.. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. ఫలానా అభ్యర్థికి ఇచ్చిన టికెట్‌ను (MLA Ticket) వెనక్కి తీసుకోండని ద్వితియ శ్రేణి నేతలు, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు డిమాండ్ చేస్తున్నారు. కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోయే నేతలు వీళ్లే అంటూ సోషల్ మీడియా వేదికగా జాబితా ఒక్కటి తెగ వైరల్ అవుతోంది.
జాబితాలో ఎవరెవరున్నారు..?
01. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు
02. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్
03. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
04. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
05. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
06. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
07. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి
08. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు
09. జిట్టా బాలకృష్ణారెడ్డి
10. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ముఖ్యనేతలు సొంత పార్టీలకు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ పేర్లతో ఉన్న జాబితా తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వీరంతా పీసీసీతో సీక్రెట్‌గా సమావేశాలు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన టీడీపీ నేతలపై కూడా హస్తం పార్టీ దృష్టిసారించినట్లు తెలియవచ్చింది. టీడీపీలో చురుగ్గా పనిచేసి ఆ తర్వాత బీఆర్ఎస్, బీజేపీలో చేరి ఎలాంటి ప్రాధాన్యత దగ్గని వారిని, రాజకీయాల్లో యాక్టివ్ లేనివారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంప్రదించినట్లు తెలిసింది. తనకున్న పరిచయాలతో మరింత మందికి కాంగ్రెస్ కండువాలు కప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారట రేవంత్.
చేరిక ఎప్పుడు ఉండొచ్చు..?
మొత్తానికి చూస్తే.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ నుంచి ముఖ్యనేతలను లాక్కోవడానికి చేరికలపై కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసిందని చెప్పుకోవచ్చు.ఈ నెల 16న హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో చేరికలన్నీ ఒకేసారి చేపట్టి ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేయాలని రేవంత్ రెడ్డి మాస్టర్ వేసినట్లుగా తెలుస్తోంది. అగ్రనేత సోనియా గాంధీ 17న భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. చేరికలన్నీ సోనియా సమక్షంలోనే జరుగుతాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. పైన చెప్పిన నేతలతో పాటు కొందరు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేలా అడుగులు వేస్తోంది. అయితే.. చివరి నిమిషంలో ఇంకా ఇద్దరు ముగ్గురు ముఖ్యనేతలు కూడా కండువా కప్పుకునే అవకాశాలున్నాయట. అందుకే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యమవుతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలే చోటుచేసుకునే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఏం జరుగుతుందో..? పార్టీలో చేరిన నేతలకు ఎంతమందికి టికెట్లు దక్కుతాయో.. వేచి చూడాల్సిందే మరి.
ఇవి కూడా చదవండి
Jodo Yatra : రాహుల్ యాత్రకు ఏడాది.. ‘జోడో’తో కాంగ్రెస్‌కు కలిసొచ్చిందేంటి.. ఇంకా చేయాల్సిందేంటి..!?
Delhi Liquor Case : విచారణలో వేగం పెంచిన ఈడీ.. ఉదయం నుంచి బుచ్చిబాబుపై ప్రశ్నల వర్షం.. నెక్స్ట్ ఎవరు..!?
Lagadapati Re Entry : లగడపాటి రీ ఎంట్రీ సరే.. ఏ పార్టీ, పోటీ ఎక్కడ్నుంచి.. ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..!?
Bharat Row : ‘భారత్’ గురించి పవన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ
BRS First List : బీఆర్ఎస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారిపై ఎమ్మెల్యే భర్త ఆసక్తికర వ్యాఖ్యలు!
Updated Date - 2023-09-07T22:14:50+05:30 IST