ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS Formation Day : రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లలో గెలుస్తామో ముందే చెప్పేసిన కేసీఆర్.. ఏపీ గురించి ప్రస్తావిస్తూ..

ABN, First Publish Date - 2023-04-27T16:52:42+05:30

అవును.. బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కానే కాదు.. ఎలాగైనా మళ్లీ మనదే అధికారం.. కానీ ప్రజాప్రతినిధులు చేయాల్సినవి చాలానే ఉన్నాయ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కానే కాదు.. ఎలాగైనా మళ్లీ మనదే అధికారం.. కానీ ప్రజాప్రతినిధులు చేయాల్సినవి చాలానే ఉన్నాయ్.. అంటూ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (TS CM KCR) పలు కీలక సలహాలు, సలహాలు ఇచ్చారు. అంతేకాదు.. ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. గురువారం జరిగిన బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో (BRS General Body Meeting) కేసీఆర్ ఇంకా ఏమేం అన్నారు..? ఈ సమావేశం సందర్బంగా గులాబీ బాస్ చేసిన కీలక ప్రకటన ఏంటి..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అదేం పెద్ద టాస్క్ కాదే..!

మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు, రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. ఈసారి కచ్చితంగా 100 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కానే కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి. ఈ రెండు సార్లు కంటే ఎక్కువ సీట్లు రావాలనేది ప్రాధాన్యతాంశం. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ కూడా నడపొచ్చు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలి. క్యాడర్‌లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టండి. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి. దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదు. రాజకీయ పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగినం. అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ (Ab Ki Bar Kisan Sarkar) నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం. అకాల వర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలి. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం. మార్క్ ఫెడ్‌కు ఈ మేరకు ఆదేశాలిస్తాం. రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే నెంబర్లను నా ఆఫీసులో ఇవ్వండి. ఇళ్లు కట్టుకోవటానికి యోగ్యంగా ఉంటే వాటిని తక్షణం పంచేద్దాం. మన శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జీలుగా ఉపయోగించుకోవాలి. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. మూడు, నాలుగు నెలల్లో ఇంచార్జీల నియామక ప్రక్రియ పూర్తికావాలిఅని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రస్తావన..!

దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రణాళికలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518. ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు 12:45 గంటల కల్లా అక్కడికి చేరుకొండి. 01:58 గంటల నుంచి 2:04 గంటల వరకు మంత్రులు వారి వారి చాంబర్స్‌కు పోవాలి. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో దేశమే ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రం ప్రగతిని నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారు. మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు..?’ అని మహా సర్కార్‌పై (Maha Sarkar) కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

బీఆర్ఎస్ తీర్మానాలు ఇవీ..

దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగమించాలి. దేశానికి సాగునీటి విధానం రూపొందించాలి. వ్యవసాయానికి పెట్టుబడి సాయం దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. భారత ప్రజలను ఏకం చేసి బలీయమైన రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ముందుకు వెళ్లాలి. బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు సమగ్ర సాగునీటి విధానం రూపొందించాలి. తెలంగాణలో ఉన్న రైతురాజ్యం దేశం అంతటా స్థాపించాలి. ఇందుకోసం అలుపెరుగని పోరాటం దిశగా బీఆర్ఎస్ ముందుకు వెళ్ళాలి. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించాలి. నూతన విద్యుత్ విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకురావాలి. బీజేపీ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరిని ఖండించేలా సభ ఏర్పాటు చేయాలి. దళిత బంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి. దేశంలో మౌళిక వసతుల కల్పన చేయాలి. కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలిఅని బీఆర్ఎస్ జనరల్ బాడీ మింటింగ్ తీర్మానించింది. కాగా.. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు.

మొత్తానికి చూస్తే.. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ పార్టీలు మొదలుకుని జాతీయ స్థాయి రాజకీయాల వరకూ అన్ని విషయాలను ప్రస్తావించారు. అంతేకాదు ఏపీ గురించి కైడా ప్రస్తావనకు రావడం గమనార్హం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పలు కీలక తీర్మానాలను చేసింది. ఈ తీర్మానాలు, అసెంబ్లీ స్థానాలపై కేసీఆర్ ధీమాపై ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash In YS Viveka Case : విచారణ కీలక దశలో ఉండగా కొత్త కోణాలు బయటపెట్టిన ఎంపీ వైఎస్ అవినాష్.. సునీతక్క అని సంబోధిస్తూనే..

******************************

KCR Warning: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కీలక సమావేశంలో కేసీఆర్ సీరియస్ వార్నింగ్

******************************
******************************

TS BJP : చేవెళ్ల సభలో అమిత్ షా తీవ్ర అసహనం.. టూర్ ముగించుకొని వెళ్తూ.. వెళ్తూ.. అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..!

******************************

AP Politics : వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా.. ఈ పోస్టర్లలో నిజమెంత.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకిలా..!?


******************************

Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉండగా.. డైరెక్టర్ ఆర్జీవీ పెను సంచలనం..

******************************

KCR BRS Sabha : మరాఠా గడ్డ నుంచి మాటిస్తున్నా.. మొత్తం మార్చేస్తా.. కీలక హామీలిచ్చిన కేసీఆర్..
******************************

SC Verdict On YS Viveka Case : సుప్రీం తీర్పుతో వైఎస్ అవినాష్‌కు దారులన్నీ క్లోజ్.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. ఇదేగానీ జరిగితే..!

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..


******************************

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతి సాధించిన సీబీఐ.. సడన్‌గా ఇలా జరగడంతో...

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

******************************

Updated Date - 2023-04-27T17:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising