ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kavitha on Sukesh : సుఖేష్‌ చంద్రశేఖర్‌‌ రిలీజ్ చేసిన వాట్సాప్ చాట్‌పై కవిత రియాక్షన్ ఇదీ.. మీడియాకే ఛాలెంజ్ చేస్తూ..

ABN, First Publish Date - 2023-04-13T15:54:24+05:30

సుమారు రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (BRS MLC Kavitha) సంచలన ఆరోపణలు చేస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సుమారు రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (BRS MLC Kavitha) సంచలన ఆరోపణలు చేస్తూ వాట్సాప్ చాట్‌ స్క్రీన్‌షాట్లను రిలీజ్ చేసిన విషయం విదితమే. దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద దుమారమే రేగుతోంది. ఇక మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో (Social Media) అయితే ఎక్కడ చూసినా ఈ వార్తలే వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై కవిత ఎట్టకేలకు స్పందించారు. గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటనను కవిత రిలీజ్ (Kavitha) చేశారు.

కవిత ప్రకటన ఇదీ..

బీఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వక దుష్ప్రచారం..

కేసీఆర్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక.. నా మీద దాడి ఇలా జరుగుతోంది..

ఫేక్ చాట్‌లతో నా మీద దుష్ప్రచారం..

సుఖేశ్‌తో నాకు ఎలాంటి పరిచయం లేదు.

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్‌గారి జాతీయస్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారుఅని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుఖేషా.. ఎవరాయన..!

అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవీ పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు తయారైంది. ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు. ఇది అత్యంత దురదృష్టకరం’ అని కవిత ప్రకటనలో చెప్పుకొచ్చారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత - సుకేశ్ చంద్రశేఖర్ వాట్సప్ చాటింగ్? సంచలన స్ర్కీన్‌షాట్లు షేర్ చేసిన సుకేశ్!

మీడియాకు ఛాలెంజ్..!

పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారని తెలంగాణ సమాజం గ్రహించాలి.. జాగ్రత్త పడాలి. తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. పాలు ఏంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ గారి మీద కక్షతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్ష్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుంది. నా మీద బురద జల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత, దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..! జై తెలంగాణ... జై భారత్అని కవిత వివరణ ఇచ్చుకున్నారు.

మొత్తానికి చూస్తే.. సుఖేష్ రోజుకో సంచలన విషయం లేఖలు, స్క్రీన్ షాట్ల రూపంలో రచ్చ చేస్తున్నాడు. ఇప్పుడు కవిత స్వయంగా స్పందించి.. అవన్నీ వాస్తవాలు కాదని కొట్టి పడేశారు. కవిత రియాక్షన్‌పై సుఖేష్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఏంటో వేచి చూడాలి మరి.

Updated Date - 2023-04-13T18:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising