ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

ABN, First Publish Date - 2023-02-07T22:26:27+05:30

ఓటుకు లక్ష రూపాయిలు ఇచ్చి.. మొత్తం వెయ్యి కోట్లు ఖర్చుచేసినా సరే నాపై అధికార పార్టీ అభ్యర్థి గెలవలేరు.. ఇప్పటికే రెండుసార్లు గెలిచా.. రానున్న ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తా.. హ్యాట్రిక్ (Hat-trick) కూడా కొడతా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటుకు లక్ష రూపాయిలు ఇచ్చి.. మొత్తం వెయ్యి కోట్లు ఖర్చుచేసినా సరే నాపై అధికార పార్టీ అభ్యర్థి గెలవలేరు.. ఇప్పటికే రెండుసార్లు గెలిచా.. రానున్న ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తా.. హ్యాట్రిక్ (Hat-trick) కూడా కొడతా.. అంతేకాదు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టను.. అదే నియోజకవర్గం (Constituency) నుంచే మళ్లీ పోటీచేస్తానని కూడా ముందే చెప్పేశారు. ఇదీ ఓ ఎమ్మెల్యే ధీమా.. ఛాలెంజ్ (Challange) కూడా. అసలు ఈ రేంజ్‌లో కాన్ఫిడెన్స్ ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు..? అసలాయన ఏ పార్టికి చెందిన వ్యక్తి..? ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారు..? ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండానే గెలిచేస్తాననే ధీమా ఆయనకు ఎక్కడ్నుంచి వచ్చింది..? అసలు ఇది అయ్యే పనేనా..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఇంతకీ ఎవరాయన..?

ఆయనెవరో కాదండోయ్.. తెలంగాణ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh). గోషామహాల్.. (GoshaMahal) ఈ నియోజకర్గం హైదరాబాద్‌లో (Hyderabad) రాజకీయాలకు అత్యంత క్రియాశీలకమైనది. ఈ ప్రాంతం పేరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. అందుకు కర్త, కర్మ, క్రియ.. రాజాసింగ్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో రాజాసింగ్ ప్రతిరోజూ ఏదో ఒక నిరసన కానీ.. ధర్నా కానీ.. కనీసం ర్యాలీ అయినా సరే కచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇవేమీ లేదంటే రాజాసింగ్.. ఫలానా చోట గోవుల తరలింపును అడ్డుకున్నాడనే వార్తయినా కచ్చితంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ల గురించి ఎవరైనా అనుచితంగా మాట్లాడారో ఇక రాజాసింగ్ చేతిలో అయిపోయారంతే.. అలా ఉంటుంది పరిస్థితి. నిత్యం నియోజకవర్గంలోని ప్రజలతో ఆయన టచ్‌లో ఉంటూనే ఉంటారు. ఏదైనా ఫలానా సమస్య అని ఇంటి తలుపు తడితే ఏ టైమ్ అయినా సరే పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఇప్పటికే రెండుసార్లు రాజాసింగ్‌ను గోషామహాల్ ఎమ్మెల్యేగా గెలిపించారు.

హ్యాట్రిక్ కొడతారా.. అదెలా..?

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ మూడోసారి తప్పకుండా గెలిచి హ్యాట్రిక్ కొడతానని తాజాగా మీడియా ముందు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ (BRS) అభ్యర్థి ఓటుకు లక్ష రూపాయిలు ఇచ్చినా సరే గెలవరని.. తాను ఒక్కరూపాయి కూడా ఖర్చుపెట్టకుండానే గెలిచి సత్తా చాటుతానని బల్లగుద్ది మరీ చెబుతున్నారు రాజాసింగ్. ప్రత్యర్థి వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారంటే రాజాసింగ్ ఏ ధైర్యంతో ఇలా అన్నారు..? అని తెలంగాణ రాజకీయాల్లో అంతా చర్చించుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీపై ఎప్పుడూ లేనిపోని విమర్శలు గుప్పించడం.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా రాజాసింగ్‌‌ చేస్తుండటంతో ఈసారి ఎలాగైనా సరే ఆయనకు చెక్ పెట్టాలనే యోచనలో అధికార పార్టీ ఉంది. మరోవైపు.. సొంత పార్టీపై విమర్శలు గుప్పించడం, ఆ మధ్య మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నుంచి రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ ఇంకా అధిష్టానం ఎత్తేయలేదు. ఈ పరిస్థితుల్లో రాజాసింగ్ ఇలా కామెంట్స్ చేయడంతో అసలు ఈయన ఏ పార్టీ నుంచి చేయాలని అనుకుంటున్నారు..? బీజేపీ అధిష్టానం (BJP High Command) టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే.

ఎలా పోటీచేస్తారు..?

రాజాసింగ్‌ జైలుకెళ్లాక గోషామహాల్ నుంచి బీజేపీ తరఫున ఎవర్ని బరిలోకి దింపాలనే దానిపై అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసిందనే టాక్ అప్పట్లోనే నడిచింది. ఓ సీనియర్ నేత పేరు కూడా ప్రచారం జరిగింది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రాజాసింగ్ పరిస్థితేంటి..? పోనీ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్‌లో చేరి పోటీచేసే పరిస్థితి ఉందా అంటే అది వందకు వెయ్యి శాతం జరగని పనేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రెబల్‌గా మారి ఇండిపెండెంట్‌గా తప్ప మరో ఛాన్స్ అయితే లేదు. అప్పట్లో ఓసారి ఇండిపెండెంట్‌గానే గెలుస్తానని కూడా చెప్పకనే చెప్పారు. అలా పోటీచేస్తే ఏ మేరకు బీజేపీ క్యాడర్ సహకరిస్తుందన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

మొత్తానికి చూస్తే.. పైకి అంత ధీమాగా రాజాసింగ్ చెబుతున్నా లోలోపల పరిస్థితులు మాత్రం వేరేగా ఉన్నాయి. ఎన్నికల సమయానికి బీజేపీ అధిష్టానం రాజాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. అయినా.. ఆయన ఈ రేంజ్‌లో బల్లగుద్ది మరీ చెబుతున్నారంటే వ్యూహాలు ఏముంటాయో.. ఎలా హ్యాట్రిక్ కొడతారో తెలియాలంటే ఎన్నికల వరకూ వేచి చూడక తప్పదు మరి.

*****************************************

ఇవి కూడా చదవండి..

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?


*****************************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ


*****************************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..


*****************************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న రెండ్రోజులకే ఆదాలకు ఊహించని షాక్.. అరెరె ఇలా జరిగిందేంటి..!



*****************************************

YSRCP : చంద్రబాబుతో రహస్య భేటీ.. టీడీపీలో చేరికపై ఒక్క ప్రెస్‌మీట్‌తో తేల్చేసిన వైసీపీ ఎంపీ.. అసలేం జరిగిందంటే..


Updated Date - 2023-02-07T22:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising