ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam : కవితకు ఈడీ నోటీసులివ్వడంపై ఫస్ట్ టైమ్ స్పందించిన కేసీఆర్.. సీఎం మాటలతో బీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్..

ABN, First Publish Date - 2023-03-10T18:46:47+05:30

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులిచ్చిన (ED Notice) విషయం తెలిసిందే. మార్చి-11న ఈడీ ఎదుట కవిత హాజరుకానున్నారు. అయితే విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతవరకూ కవితకు ఈడీ నోటీసులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటిసారి స్పందించారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ముందస్తు ఎన్నికల ప్రచారం, కవితకు ఈడీ నోటీసులివ్వడంపై కీలకంగా చర్చించారు.

ఇలా అనేశారేంటి..?

ఎన్నికల గురించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన తర్వాత కవిత గురించి ప్రస్తావన వచ్చింది. ఈడీ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేయొచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ వేధిస్తున్నారని గులాబీ బాస్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ‘కవితను మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’ అంతేకదా..? అని కేసీఆర్ సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే ఎవరికీ భయపడేది లేదని.. పోరాటం అస్సలు ఆపే ప్రసక్తే లేదన్నారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లేకుండా చేద్దామని పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని.. దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రుల నుంచి ఇప్పుడు కవిత వరకు ఈ వేధింపులు వచ్చాయన్నారు. ‘ఏం చేస్తారో.. చేసుకోనివ్వండి. కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదు. బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించొద్దు’ అని పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కవితను కూడా బీజేపీలో చేరమన్నారని మరోసారి సీఎం గుర్తు చేస్తారు.

కాగా.. కేసీఆర్ కామెంట్స్‌తో నేతలంతా జై కేసీఆర్.. అంటూ నేతలు నినదించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) గులాబీ బాస్ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. కవితను అరెస్ట్ చేయొచ్చన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సమావేశంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. స్వయంగా కేసీఆరే ఈ వ్యాఖ్యలు చేయడంతో సార్ ఇలా అనేశారేంటని బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచనలో పడ్డాయట. శనివారం నాడు ఏం జరుగబోతోందో.. ఏంటో చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

BRS KCR : తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడో ఒకే ఒక్క మాటలో తేల్చేసిన సీఎం కేసీఆర్..


******************************

Updated Date - 2023-03-10T19:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising