TS Politics : గజ్వేల్‌కు గులాబీ బాస్ గుడ్ బై చెప్పేస్తున్నారా.. పరిశీలనలో రెండు నియోజకవర్గాలు.. ఆ సర్వే తర్వాత మారిన సీన్..!?
ABN, First Publish Date - 2023-07-20T22:53:25+05:30
తెలంగాణ రాజకీయాల్లో, గులాబీ బాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విషయంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చెప్పిందే నిజమవుతోందా..? నిజంగానే గజ్వేల్‌కు (Gajwel) కేసీఆర్ గుడ్ బై చెప్పేస్తున్నారా..? ఇటీవల ప్రభుత్వం చేయించిన సర్వేలో (Survey) షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయా..? ఆ సర్వే చూసిన తర్వాత కేసీఆర్ తన ముందు రెండు ఆప్షన్లు పెట్టుకున్నారా..? అంటే తాజా పరిణామాలు, సోషల్ మీడియా (Social Media) లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది..
తెలంగాణ రాజకీయాల్లో, గులాబీ బాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విషయంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చెప్పిందే నిజమవుతోందా..? నిజంగానే గజ్వేల్‌కు (Gajwel) కేసీఆర్ గుడ్ బై చెప్పేస్తున్నారా..? ఇటీవల ప్రభుత్వం చేయించిన సర్వేలో (Survey) షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయా..? ఆ సర్వే చూసిన తర్వాత కేసీఆర్ తన ముందు రెండు ఆప్షన్లు పెట్టుకున్నారా..? అంటే తాజా పరిణామాలు, సోషల్ మీడియా (Social Media) లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది. ఇంతకీ కేసీఆర్ ముందున్న ఆ ఆప్షన్లు ఏవి..? రేవంత్ ఇప్పటి వరకూ ప్రెస్‌మీట్లలో ఏం చెబుతూ వచ్చారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ పొలిటికల్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
అసలేం జరుగుతోంది..?
రానున్న ఎన్నికల్లో కేసీఆర్ వందకు వంద శాతం గజ్వేల్‌లో గెలిచే ప్రసక్తే లేదు..! ఆయన మరో నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు..! ఇదంతా ఓ సర్వేలో బయటపడింది..! ఇవీ రేవంత్ రెడ్డి మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ చెప్పే మాటలు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన అన్న మాటలే అక్షరాలా నిజమవుతున్నాయ్. అదెలాగంటే.. ఇటీవల తన ఇంటెలిజెన్స్‌తో బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈ ఎన్నికల్లో కనీసం గజ్వేల్‌లో కేసీఆర్ కూడా గట్టెక్కడం కష్టమేనని తేలిందట. ఈ సర్వే చూసినా కేసీఆర్ కంగుతిన్నారట. మరోసారి సర్వే చేయించినప్పటికీ సేమ్ అదే సీన్ రిపీటయ్యిందట. ఇందుకు కారణం రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ చేసిందేమీ లేదట. కనీసం రోడ్లు కూడా సర్లేని పరిస్థితట. ఇక డబుల్ బెడ్రూమ్, రైతు బంధు, దళిత బంధు.. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు కొన్ని ఏరియాలకు అస్సలు అందలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు కేసీఆర్‌పై పీకల్లోతు కోపంతో ఉన్నారట. దీంతో ఇక గజ్వేల్ నుంచి పోటీచేస్తే కష్టమేనని భావించిన కేసీఆర్.. ఆ జిల్లానే వదిలేయాలని ఫిక్సయ్యారట.
బాస్ చూపంతా ఇటే..?
గజ్వేల్ తర్వాత కేసీఆర్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్న విషయంపై పెద్ద డైలామానే నెలకొందట. అయితే.. కేసీఆర్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో ఒకటి కామారెడ్డి (Kamareddy) కాగా.. రెండొవది తన పాత నియోజకవర్గమైన సిద్ధిపేట (Siddipet) అని తెలిసింది. గత కొన్నిరోజులు సోషల్ మీడియా వేదికగా గులాబీ బాస్ గజ్వేల్‌కు గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్నప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు ఇంతవరకూ ఖండించకపోవడం గమనార్హం. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ వీరాభిమానులు స్పందించకపోవడంతో మౌనానికి అర్థం అంగీకారమేనని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఈ వార్తలను మరింత వైరల్ చేస్తున్నాయి. ఒకవేళ కామారెడ్డి నుంచి పోటీచేస్తే మాత్రం.. పార్టీ బలోపేతానికేనని పరోక్షంగా చెప్పాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. వాస్తవానికి.. ఉత్తర తెలంగాణ (Uttara Telangana) జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ అంతంత మాత్రమే ఆదరణ ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పరిస్థితి మరింత తారుమారయ్యే ఛాన్స్ ఉందట. అందుకే ఇక్కడ్నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణుల్లో లోలోపల చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే ఇక్కడ వ్యవహారాలన్నీ లోలోపల మంత్రి కేటీఆర్ చక్కబెడుతున్నారని టాక్ నడుస్తోంది. ఇక మిగిలింది సిద్దిపేట మాత్రమే.. కేసీఆర్ మొదటిసారి గెలిచింది ఇక్కడ్నుంచే. 1983లో టీడీపీతో ప్రారంభమైన కేసీఆర్ విజయం.. 2004 వరకు ఉప ఎన్నికలతో కలిపి మొత్తం ఏడుసార్లు గెలిచారు. ఆ తర్వాతే కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీచేయడం.. అక్కడ్నుంచి ఇప్పుడున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి మారిపోయారు. ఈయన గజ్వేల్ వెళ్లిన తర్వాత సిద్ధిపేటను మంత్రి హరీష్ రావు చూసుకుంటున్నారు. కేసీఆర్ సిద్ధిపేట నుంచి పోటీచేస్తే పరిస్థితేంటి..? వర్కవుట్ అవుతుందా..? లేదా..? అని హరీష్ నియోజకవర్గంలోని ద్వితియ శ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోంది కాబట్టి అటు వైపు చూడటానికి గులాబీ బాస్ సాహసించట్లేదట. మరోవైపు.. గజ్వేల్ నుంచి ఎవర్ని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్, బీజేపీలు ఓ నిర్ణయానికి వచ్చాయట. బలమైన అభ్యర్థులే ఈ రెండు పార్టీలకు దొరికినట్లుగా సమాచారం.
మొత్తానికి చూస్తే.. అటు రేవంత్ చెప్పింది చెప్పినట్లు జరిగిపోతూ ఉండటం, ఇటు కేసీఆర్ చేయించిన సర్వేల్లోనూ.. ఊహకందని విషయాలు వెలుగులోకి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారట. ఇప్పటి వరకూ రేవంత్ చేసిన కామెంట్స్ అన్నింటిపైనా బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ వస్తోంంది కానీ.. గజ్వేల్, సిట్టింగ్‌లకు టికెట్లపై మాత్రం గులాబీ పార్టీ నేతలు నోరుమెదలపలేదు. సో దీన్ని బట్టి చూస్తే.. ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రం దొరికినట్లేనని అంటున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఆరితేరిన, రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ సామాన్యంగా ఎవరికీ అర్థం కారు.. చివరికి ఏం జరుగుతుందో.. వేచి చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
Rains lash Telangana : ఐటీ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి..
TS Rains : భారీ వర్షాలతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటు సెలవులు..
Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?
Jr Ntr : ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ భారీగా ఫ్లెక్సీలు.. అసలు విషయం తెలిస్తే..?
Janasena : ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్న పవన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి..!
TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!
BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్
Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?
Updated Date - 2023-07-20T22:57:23+05:30 IST