ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR Meets Governor : గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేక భేటీ.. 20 నిమిషాలు ఏమేం చర్చించారు..!?

ABN, First Publish Date - 2023-08-24T20:37:30+05:30

అవును.. ఇన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గా (Governor Vs Govt) ఉన్న పరిస్థితులన్నీ ఒకే ఒక్క భేటీతో మారిపోయాయ్.! ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నర్ తమిళిసైతో (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR) రాజీ అయ్యారనే చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!..

అవును.. ఇన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గా (Governor Vs Govt) ఉన్న పరిస్థితులన్నీ ఒకే ఒక్క భేటీతో మారిపోయాయ్.! ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నర్ తమిళిసైతో (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR) రాజీ అయ్యారనే చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) మంత్రిగా రాజభవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో అటు కేసీఆర్.. ఇటు గవర్నర్ ఇద్దరూ ఎంతో హ్యాపీగా పాల్గొన్నారు. అంతేకాదు.. ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయిన తర్వాత 20 నిమిషాల పాటు ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ కూడా రాజ్‌భవన్‌లో (Raj Bhavan) జరిగింది. దీంతో చిత్రవిచిత్రాలుగా వార్తలు వస్తుండగా.. ఈ భేటీ పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది. ఇంతకీ రాజ్‌భవన్‌లో ఏం జరిగింది..? గవర్నర్‌తో కేసీఆర్ చర్చించి ఉండొచ్చు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.


ఏం జరిగింది..?

నిన్న, మొన్నటి దాకా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ (Pragathi Bhavan) ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గవర్నర్-కేసీఆర్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ కన్నెర్రజేయడం, బహిరంగంగానే కేసీఆర్ తీరును తప్పుబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. దీంతో గవర్నర్.. బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తిట్టిపోసిన పరిస్థితులున్నాయి. మరోవైపు.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌ అని కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే.. అయితే ఇవాళ్టితో మునుపటి పరిస్థితులన్నీ మటు మాయం అయ్యాయ్!. ఎందుకంటే గవర్నర్‌తో కేసీఆర్ దాదాపు రాజీ అయినట్లే..! రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్‌తో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాలపాటు పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ఇప్పుడీ భేటీపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు. అయితే ఈ రాజీ శాశ్వతమో.. తాత్కాలికమో మరి!.

ఏమేం చర్చించారో..?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పెండింగ్ బిల్లులు (Pending Bills) , ఇద్దరు నామినేటెడ్ ఎమ్మెల్సీల (Nominated MLC) ఆమోదం సహా పలు అంశాలపై భేటీలో గవర్నర్‌ను కేసీఆర్ రెక్వెస్ట్ చేసినట్లు తెలియవచ్చింది. ఇన్నాళ్లు ఉప్పు-నిప్పులా ఉన్న వీరు ఒక్కసారిగా ప్రత్యేకంగా భేటీ కావడంతో.. ఈ స్నేహపూర్వక భేటీపై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఈ అనూహ్య పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చే నడుస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పరోక్ష స్నేహబంధంపై తీవ్ర చర్చ జరుగుతున్న ఈ టైమ్‌లో ఇలా భేటీ జరగడం గమనార్హం. అంతేకాదు భేటీ తర్వాత తెలంగాణ మంత్రులు, కేసీఆర్‌తో కలిసి నవ్వుతూనే ఫొటోలు కూడా దిగారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం.. బీఆర్ఎస్-బీజేపీ మధ్య సంబంధాలున్నాయన్న విషయం అక్షరాలా నిజమైందని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నాయి. ఈ భేటీతో అసలు విషయం రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్‌ కట్‌గా అర్థమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే భేటీలో ఏం చర్చించారనే విషయం అధికారికంగా బయటికి రాకపోయినప్పటికీ చిత్ర విచిత్రాలుగా వార్తలు మాత్రం వస్తున్నాయ్. కేసీఆర్ అవసరం కాబట్టి.. రాజ్‌భవన్‌కు వెళ్లి మరీ రాజీ అయ్యారనే అనే విమర్శలు చాలానే వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో స్ట్రాటజీగా గులాబీ బాస్ ముందడుగేలేస్తున్నారన్న మాట. ఈ వార్తలపై అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


TS Politics : కేసీఆర్‌కు ఊహకందని షాకివ్వబోతున్న రేవంత్ రెడ్డి.. వైఎస్ తర్వాత ఇదే రికార్డ్..!?


Mynampally Issue : మైనంపల్లిపై ఏక్షణమైనా సస్పెన్షన్ వేటు.. బీఆర్ఎస్ తరఫున మల్కాజిగిరి బరిలో విజయశాంతి..!?


TS Assembly Polls : రెండు అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ గెలిస్తే పరిస్థితేంటి.. రాజీనామా ఎక్కడ్నుంచి.. లక్కీ ఛాన్స్ ఎవరికి..!?


Where Is Vamsi : వల్లభనేని వంశీ కనబడుటలేదు.. వైఎస్ జగన్‌తో దుట్టా భేటీలో అసలేం జరిగింది.. ఎందుకీ మౌనం..!?


BRS List : కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక మైనంపల్లి రియాక్షన్ ఇదీ.. ఈ ట్విస్ట్ ఏంటో..!?



Updated Date - 2023-08-24T20:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising