ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly Polls : కాంగ్రెస్‌లో ఉంటారో.. కారెక్కుతారో క్లియర్‌కట్‌గా చెప్పేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2023-08-19T20:10:16+05:30

ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. (MLA Jagga Reddy) ఈ పేరు గత వారం పదిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) ఎక్కువగా వినిపించింది.. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం.. బీఆర్ఎస్ మంత్రులతో (BRS Ministers) చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఈ పరిణామాలన్నీ అటు కారు.. ఇటు హస్తం పార్టీల్లో పెద్ద హాట్ టాపిక్‌గా నిలిచాయి..

ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. (MLA Jagga Reddy) ఈ పేరు గత వారం పదిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) ఎక్కువగా వినిపించింది.. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం.. బీఆర్ఎస్ మంత్రులతో (BRS Ministers) చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఈ పరిణామాలన్నీ అటు కారు.. ఇటు హస్తం పార్టీల్లో పెద్ద హాట్ టాపిక్‌గా నిలిచాయి. దీంతో సారు ఎటువైపు ఉన్నారో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు సైతం ఆందోళన చెందిన పరిస్థితి. అప్పుడెప్పుడో యువనేత రాహుల్ గాంధీ జోడో (Rahul Jodo) యాత్రలో కనిపించారే తప్ప.. కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపించిన.. ఆయన వాయిస్ ఎక్కడా వినిపించిన దాఖలాల్లేవ్. దీంతో కాంగ్రెస్ కండువా తీసేసి కారెక్కుతున్నారని పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో ఇదే సమయంలో బీఆర్ఎస్ తొలి జాబితాలో (BRS First List) కూడా జగ్గారెడ్డి పేరు ఉండబోతోందని గత 24 గంటలుగా ప్రచారం జరుగుతోంది. సోమవారం నాడు సీఎం కేసీఆర్ (CM KCR).. తొలి జాబితాల్లో జగ్గారెడ్డి పేరు ప్రకటించబోతున్నారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమనడంతో తెలంగాణ రాజకీయాల్లో ఏమిటీ విచిత్రమని జనాలంతా నోరెళ్లబెట్టిన పరిస్థితి. దీంతో ఇక జగ్గారెడ్డి మీడియా (అసెంబ్లీ మీడియా పాయింట్) ముందుకు వచ్చి కాంగ్రెస్‌లోనే ఉంటారా లేకుంటే కారెక్కుతారో అనేదానిపై స్వయంగా క్లారిటీ ఇచ్చుకున్నారు.


క్లియర్ కట్‌గా..!

నా రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీ‌తోనే.. నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతోనే. నాకేమైనా బాధ్యత ఇస్తే కచ్చితంగా చేస్తాను. నేను పార్టీ మారుతాననే ప్రచారం అబద్దం. నేను రాహుల్ గాంధీని మొదటిసారి కలిసిన విషయం అందరికీ తెలుసు. నేను రెండవరోజు కూడా ఒంటరిగా రాహుల్‌ను కలిశారు. రాహుల్ నాకు 20 నిమిషాల సమయం ఇచ్చారు. నేను చెప్పేది రాహుల్ విన్నారు. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాది శాసించే వయస్సు.. నన్ను ఎవరో బుజ్జగిస్తే వింటానా?. కథలు, కథనాలు మీరే (కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి) రాస్తున్నారు. రాసేవాళ్ళకు అంత ఆనందం ఏంటో నాకు తెలియట్లేదు. ఏడాదిన్నరగా సోషల్ మీడియాలో నాపై ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇలా జరుగుతోంది. నాపై ఇలా ఎందుకు రాయిస్తున్నారో తెలియదుఅని కారెక్కే ప్రస్తక్తే లేదని.. కాంగ్రెస్‌లోనే ఉంటానని బల్లగుద్ది మరీ జగ్గారెడ్డి చెప్పారు.

జోడో సక్సెస్ చేశా..!

రాహుల్ జోడోయాత్ర సంగారెడ్డి నుంచి వస్తోందంటే సంతోషమయ్యింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా జోడోయాత్ర సక్సెస్ చేశాను. రాహుల్ పాదయాత్రలో ఆయనకి నాపేరు నోటెడ్ అయింది. రాహుల్ నన్ను మెచ్చుకున్న పది రోజులకే నన్ను కోవర్ట్ అని సోషల్ మీడియాలో రాయించారు. ఇదేం దరిద్రపు అలవాటు.. ఇంతా శాడిజం ఎందుకు..?. 2017లో కోట్లాది రూపాయలు పెట్టి భారీ బహిరంగ సభ చేశాను. 2018లో పాస్‌పోర్ట్ కేసులో నన్ను ప్రభుత్వం జైల్లో పెట్టింది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్లాడి గెలిచాను. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని రేవంత్ తీర్మానం చేస్తే సీఎం కేసీఆర్ సొంత జిల్లాల్లో కోట్లాడాల్సిందేనని నిలబడ్డాను. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లతో సహా 9 ఓట్లు అదనంగా తెచ్చాను. కాంగ్రెస్ కోసం ఇంత చేస్తుంటే ఎవడికి తోచింది వాళ్ళు రాస్తారు. నాపై రాసే వాళ్ళకి మెంటల్ ఎక్కిందా?. ఇంత జరుగుతున్నా నా పార్టీ వాళ్ళు మాట్లాడరా? అని జగ్గారెడ్డి ఒకింత ఆవేదనకు లోనయ్యారు.

నేను కన్నెర్రజేస్తే..?

నేను కాంగ్రెస్‌లో ఉండొద్దని ఎవరైనా వ్యూహం పన్నుతున్నరా?. చెత్త నా కొడుకులు నా గురించి ఏం అనుకుంటున్నారు?. నేను కన్నెర్ర చేస్తే రోడ్లపై తిరగగలరా?. నేనెందుకు సంజాయిషీ చెప్పాలి. నాకు అంత ఖర్మ ఎందుకు?. కొందరు నా రాజకీయ లైఫ్‌తో ఆడాలనుకుంటున్నారు. నేను ఆట స్టార్ట్ చేస్తే తట్టుకోలేరు. ఆధారాలు లేకుండా నాపై తప్పుడు వార్తలు రాస్తే నడిరోడ్డుపై నిలబెట్టి బట్టలిప్పుతా. సంవత్సరన్నర నుంచి.. ఇద్దరు, ముగ్గురు నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. నేను పార్టీ మారుతాననే ప్రచారం అబద్దం. కాంగ్రెస్ పార్టీలో ఏ సమావేశం జరిగినా నాకు సమాచారం ఉంటుంది. నాపై విష ప్రచారం చేస్తున్న మూర్ఖులు ఇకపై మానేయండి. కొంతమంది రాసే వార్తలకు చాలా బాధగా ఉంది. ఎన్నో బాధలు పడుతూ ఎమ్మేల్యే అయ్యాను. నన్ను బీఆర్ఎస్‌లోకి రావొద్దని మంత్రి హరీష్ రావును కలిసినవాళ్ళని లీడర్లని చేసింది నేనే. మరోసారి రాహుల్ గాంధీని సంగారెడ్డికి ఆహ్వానిస్తా.. ఆయన వస్తే సంతోషిస్తానుఅని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

అధికారంలోకి వస్తున్నాం..!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 119 లో 50 నియోజకవర్గాల్లో బలమైన, గెలిచే నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన నాయకత్వం ఉంది. మంచి నాయకత్వం ఉన్నవి రెండే పార్టీలు ఒకటి కాంగ్రెస్.. రెండు బీఆర్ఎస్. హరీష్ రావు కూడా ఒకప్పుడు అప్లికేషన్లు ఇచ్చి అప్లయ్ చేయమన్నారు. అదేం తప్పు కాదు. హరీష్ రావుకి అవగాహన లేకుండా, విషయాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తా అంటేనే నేను తీసుకోలేదు అని పాత విషయాలను జగ్గారెడ్డి గుర్తు చేశారు. మొత్తానికి చూస్తే.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయని క్లియర్‌కట్‌గా జగ్గారెడ్డి చెప్పేశారు. ఇకనైనా ఆయనపై వార్తలు ఆగుతాయో లేదో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


BRS Candidates List : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు డేట్, టైమ్, వేదిక ఫిక్స్.. సిట్టింగుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!



TS Assembly Elections 2023 : కేసీఆర్ ప్రకటించబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. 10 ఉమ్మడి జిల్లాలకు ఫిక్స్..!?


TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన నిమిషాల్లోనే ఎమ్మెల్యే ఫోన్ స్విచాఫ్.. ఏం జరిగిందా అని ఆరాతీస్తే..!


Independence Day : బాబోయ్ ఏంటిది.. వైసీపీ రిలీజ్ చేసిన ఈ ఫొటో చూశాక.. ఇక మీ ఇష్టం..!


Updated Date - 2023-08-19T20:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising