Raksha Bandhan: జగన్‌కు సొంత చెల్లెళ్లు ఏమయ్యారు? ఇంతకీ రాఖీ కట్టారా.. లేదా?
ABN, First Publish Date - 2023-08-31T18:18:58+05:30
ఏపీ సీఎం జగన్‌కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.. వారిలో ఒకరు సొంత చెల్లి వైఎస్ షర్మిల కాగా మరో సోదరి బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె సునీత. కొన్నేళ్ల క్రితం వీళ్లిద్దరూ జగన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపేవారు. అయితే కొన్నేళ్లుగా అన్నాచెల్లెళ్ల మధ్య అసలు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా సొంత చెల్లెళ్లు అన్న జగన్‌కు రాఖీలు కట్టారా అన్న విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు చిహ్నంగా నిలిచే రాఖీ పండగను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయ సంస్కృతిని చాటి చెప్పే రాఖీ పండగను రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు కూడా జరుపుకుని తమ ఇళ్లలో నెలకొన్న ఆనందోత్సాహాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా తన అక్కలతో రాఖీ కట్టించుకోగా.. మంత్రి కేటీఆర్ తన చెల్లి కవితతో రాఖీ కట్టించుకున్నారు. అయితే ఏపీ సీఎం జగన్‌కు సొంత చెల్లెళ్లు రాఖీ కట్టారా అన్న విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మాములుగా చెప్పుకుంటే ఏపీ సీఎం జగన్‌కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.. వారిలో ఒకరు సొంత చెల్లి వైఎస్ షర్మిల కాగా మరో సోదరి బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె సునీత. కొన్నేళ్ల క్రితం వీళ్లిద్దరూ జగన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపేవారు. అయితే కొన్నేళ్లుగా అన్నాచెల్లెళ్ల మధ్య అసలు పడటం లేదు. ఏపీలో అధికారంలోకి వచ్చాక షర్మిలను జగన్ దూరం పెట్టడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. మరోవైపు బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ హస్తం ఉందని సోదరి సునీత ఆరోపిస్తోంది. దీంతో ఆమె కూడా జగన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సొంత చెల్లెళ్లు అన్న జగన్‌కు రాఖీలు కట్టలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. అందరూ తమ అన్నల గురించి తమ అనుబంధం గురించి చెప్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్న తరుణంలో వైఎస్ షర్మిల మాత్రం తన అన్న జగన్ గురించి కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య బంధం ఇంతేనా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
గత కొన్నేళ్లుగా రాఖీ పండగ సందర్భంగా జగన్‌కు వైఎస్ షర్మిల రాఖీ కట్టడం లేదని వైసీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. చివరగా 2018లో జగన్‌కు షర్మిల రాఖీ కట్టారని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు జగన్‌కు సొంత చెల్లెళ్లు రాఖీ కట్టలేదు కానీ మంత్రి విడదల రజనీ బుధవారం నాడు రాఖీ కట్టిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పలువురు వైసీపీ మహిళా నేతలు కూడా సీఎం జగన్‌కు రాఖీలు కట్టారు.
వైఎస్ షర్మిలా రెడ్డి ట్వీట్
నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి అడుగులు వేస్తూ రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మరియు రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
కల్వకుంట్ల కవిత ట్వీట్
అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం కలిపితే తన ‘అన్న’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ రక్షా బంధన్ వేడుకలు
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh: వెలవెలబోతున్న కృష్ణా బేసిన్.. ఇదేనా జగన్ పాలనలో స్వర్ణయుగం?
Roja Selvamani: అప్పుడు చెత్త నటుడు అని విమర్శ.. ఇప్పుడు ఆయన డైలాగ్‌తో ఎలివేషన్‌లు
Bus bay Collapse: జఫ్పాలకు అది మాత్రమే తెలుసు.. వైసీపీపై మీమ్స్ మాములుగా లేవుగా..!!
Updated Date - 2023-08-31T18:30:43+05:30 IST