ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Case : క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే..!

ABN, First Publish Date - 2023-10-18T16:01:17+05:30

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాడివేడిగా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను నిశితంగా విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేయడంతో పాటు.. తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఇంతవరకూ ఓకేగానీ.. తీర్పు ఎప్పుడు రావొచ్చు..? ఆ తీర్పు ఏమై ఉండొచ్చు అన్నది ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో మెదులుతున్న ప్రశ్నలు. ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే పరిస్థితేంటి..? సీఐడీ తర్వాత ఏం చేయనుంది..? అనేదానిపై కూడా చర్చ జరుగుతోంది.


సుప్రీం తీర్పు పైనే..!

ఈ పరిస్థితుల్లో అమరావతి ఇన్నర్ రింగురోడ్డు కేసులో బాబు పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఇక్కడ ఏకంగా నవంబర్-07కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. మరోవైపు.. ఇన్నర్ రింగు రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైంది. సుప్రీంలో 17A వర్తింపుపై క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఉందని.. ఏపీ హైకోర్టుకు చంద్రబాబు లాయర్లు తెలిపారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఈ కేసుకు కూడా 17A వర్తిస్తుందని లాయర్లు కోర్టుకు స్పష్టం చేశారు. అనంతరం విచారణను నవంబర్-07కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మొత్తానికి చూస్తే.. సుప్రీం తీర్పుపైనే ఓఆర్ఆర్ కేసు కూడా ఆధారపడిందన్న మాట. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే సరే.. ఒకవేళ అలా రాని పక్షంలో ఏం చేయాలనేదానిపైన కూడా న్యాయనిపుణులతో టీడీపీ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది.

సుప్రీంలో తీర్పు ఎప్పుడు..?

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు.. శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. అయితే ఆ రోజు కూడా తీర్పు రాకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి దీన్ని సాకుగా చూపి తీర్పు మరికొంత ఆలస్యమయ్యే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. దసరా పండగ సందర్భంగా ఈ శనివారం నుంచి ఈనెల 31 వరకు సుప్రీంకోర్టుకు సెలవుదినాలు ఉన్నాయి. దీంతో శుక్రవారంలోగా ధర్మాసనం తీర్చు ఇస్తుందా? లేకుంటే సెలవుల అనంతరం వెల్లడిస్తుందా..? అనేదానిపైనా పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిలా ఉంటే.. 17 ఏ వర్తింపుపై శుక్రవారంలోగా తీర్పు ఇవ్వకుండా.. హరీష్ సాల్వే మంగళవారం కోరిన మేరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చి.. తుదితీర్పును సెలవుల అనంతరం వెల్లడిస్తుందా..? అనే ప్రశ్నపై కూడా చర్చ జరుగుతోంది. కచ్చితంగా చంద్రబాబుకు అంతా మంచే జరుగుతుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. సుప్రీం తీర్పు ఎలా ఉంటుందనేది తేలాలన్నా.. టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న ఈ ఉత్కంఠ వీడాలన్నా శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి


CBN Skill Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చు..!?


CBN Cases : చంద్రబాబు కేసులపై ఏసీబీ, హైకోర్టులో ఏం తేలుతుందో..!?



Updated Date - 2023-10-18T16:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising